ఐ.యఫ్.టి.యు అనుబంధ గౌతమి ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్ వర్కర్స్ యూనియన్ 7 వ వార్షికోత్సవ సమావేశం నిడదవోలు పంగిడి రోడ్ లో ని విశ్రాంత ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ యూనియన్ భవనం నందు నిర్వహించడమైనది.
సమావేశం లో యూనియన్ ప్రెసిడెంట్ పామర్తి సత్యనారాయణ మాట్లాడుతూ యూనియన్ ఏడు సంవత్సరాలుగా కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తోందన్నారు .

ఐ.యఫ్.టి.యు రాష్ట్ర కమిటీ సభ్యులు ఈమని గ్రీష్మ కుమార్ మాట్లాడుతూ కేంద్రం లో ఉన్న మోడి ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల 4 లేబర్ కోడ్ ల ను ఏప్రిల్ 1 నుండి అమలులోకి తేనున్న నేపథ్యంలో ఏప్రిల్ 1 న బ్లాక్ డే గా కార్మిక వర్గం పాటించాలని పిలుపునిచ్చారు. లేబర్ కోడ్ లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక వర్గం ఎన్ని పోరాటాలు చేసినా కేంద్రం పెడచెవిన పెట్టిందని, తాను కార్పొరేట్ ల ప్రతినిధి గానే నిలబడిందన్నారు.
పై కార్యక్రమంలో యూనియన్ నాయకులు మల్లిడి రామిరెడ్డి, షేక్ అహ్మద్ ఆలి, వెలిగట్ల శ్రీనివాస్ రావు, కోసన శివ, హుస్సేన్, కోదాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Also read
- మంచిగా ఉండమంటే.. తల్లినే చంపేశాడు..మిత్రుడితో కలిసి 16 ఏళ్ల కుమారుడి ఘాతుకం
- Sankashti Chaturthi :ఏడు రోజుల్లో మీకోరిక నెరవేరాలంటే…
- The Buddha:గోతమ బుద్ధుడు నెత్తిపై ఉన్న 108 పీతల రహస్యం
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- అయ్యో తాత.. మనవడిని బతికించి ప్రాణాలు వదిలేశాడు.. అసలేం జరిగిందంటే..?





