అంబేద్కర్ కోనసీమ జిల్లా..అమలాపురం:కొత్తపేట మండలం మోడేకుర్రుకు చెందిన వాసంశెట్టి నాగలక్ష్మి అమలాపురం విద్యానిధి కళాశాలలో ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతుంది. మ్యాథ్స్ టీచర్ మందలించడంతో ఐదు రోజుల క్రితం పురుగుల మందు సేవించి నాగలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడింది. తొలుత కొత్తపేటలోని చిన్నంరాజు ఆసుపత్రిలో చికిత్స అందించారు. అనంతరం అక్కడినుండి పిఠాపురంలోని ట్రినిటీ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. నాగలక్ష్మి చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందింది. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహాన్ని అమలాపురం విద్యానిధి కళాశాలకు తరలిస్తారన్న సమాచారంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మృతదేహాన్ని కిమ్స్ ఆసుపత్రి వద్ద ఉంచి విద్యానిధి కళాశాల యజమాన్యం రాజీ కుదిర్చే ప్రయత్నాలు చేస్తున్నారు. మృతురాలు నాగలక్ష్మి లెక్చరర్ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు ఇప్పటికే మెజిస్ట్రేట్ కు వాంగ్మూలం ఇచ్చింది.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025