May 4, 2025
SGSTV NEWS
Crime

ప్రెగ్నెంట్ చేస్తే లక్షల్లో డబ్బు అంటూ.. నిరుద్యోగ అబ్బాయిలే టార్గెట్

నిరుద్యోగ అబ్బాయిలను టార్గెట్ చేసి మూడు నెలల్లో ప్రెగ్నెంట్ చేస్తే రూ.20 లక్షలు ఇస్తామని సోషల్ మీడియాలో యాడ్స్ ఇస్తున్నారు. మొదట ప్రాసెసింగ్ ఫీజు కట్టించుకుని.. ఆ తర్వాత వారిని కట్ చేసి ఇంకోరిని టార్గెట్ చేసి కేటుగాళ్లు డబ్బులు వసూలు చేస్తున్నారు.


నిరుద్యోగులగా ఉన్న అబ్బాయిలను టార్గెట్ చేస్తూ పెద్ద మొత్తంలో డబ్బులు కాజేస్తున్నారు. ఫేస్ బుక్‌లో నకిలీ ఫ్రొఫైల్స్‌ను సృష్టించి అబ్బాయిల నుంచి భారీ మొత్తంలో డబ్బులు లాగుతున్నారు. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగులు, పురుషులను టార్గెట్ చేస్తూ స్కామ్ చేస్తున్నారు. ఈ స్కామ్‌లో భాగంగా అందమైన మహిళల ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో కొందరు కేటుగాళ్లు పోస్ట్ చేస్తారు.

లక్షల్లో డబ్బు ఇస్తామని..
వీరిలో ఉన్నవారిని మూడు నెలల్లోపు వారిని గర్భవతిని చేయాలి. ఇలా చేసిన వారికి రూ.20 లక్షల రివార్డు, ఆస్తి, కారు ఇస్తామని నమ్మిస్తారు. వారు చెప్పిన సమయంలో ఈ పనులు చేస్తే ఇంకా ఎక్కువ మొత్తంలో డబ్బు ఇస్తామని ఆశ చూపిస్తారు. అయితే ఇందులో చేరాలంటే మొదట యువకులు ప్రాసెసింగ్ ఫీజు కట్టాలని కండీషన్ పెడతారు.

డబ్బు మీద ఆశతో ప్రాసెసింగ్ ఫీజు కట్టిన వెంటనే వారితో కాంటాక్ట్ ఆపేసి, మరోక వ్యక్తిని టార్గెట్ చేస్తారు. ఇలా ఎందరో యువకుల నుంచి లక్షలకు పైగా కాజేశారు. ఈ స్కామ్ బారిన పడిన ఓ యువకుడు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేయగా విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ స్కాం బారిన పడి చాలా మంది యువకులు లక్షల్లో డబ్బు పోగొట్టుకున్నారు. ప్రెగ్నెన్సీ జాబ్ పేరుతో సోషల్ మీడియాలో కేటుగాళ్లు నిరుద్యోగ అబ్బాయిలను టార్గెట్ చేస్తున్నారు. కొందరు యువకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ కేసులో బీహార్ పోలీసులు 8 మందిని అరెస్టు చేశారు.

Also read

Related posts

Share via