శ్రీకాకుళం జిల్లాలో భారీమోసం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ ఒక్కొక్కరి నుంచి రూ.5లక్షల నుంచి రూ.10లక్షల వరకు తీసుకుంది. తమకు జాబ్ ఎప్పుడు ఇప్పిస్తారని ప్రశ్నించిన ఓ యువకుడిపై ఆ సంస్థ ఫౌండర్ దాడికి దిగాడు.
చిన్న ఉద్యోగం వచ్చినా చాలు అనుకునే నిరుద్యోగులను కేటుగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి డబ్బులు కొట్టేస్తున్నారు. కొంత అమౌంట్ కడితే కచ్చితంగా ఉద్యోగం ఇప్పిస్తామని ఎలాంటి భయం, భీతి లేకుండా నమ్మిస్తున్నారు. సర్లే ఉద్యోగం వస్తే తమ కష్టాలన్నీ తీరిపోతాయ్ అనుకుని అప్పో సప్పో చేసి డబ్బులు పోగేసి కడుతున్నారు. కానీ ఎంతకీ ఉద్యోగం రాకపోవడంతో కన్నీరు మున్నీరవుతున్నారు. దీంతో ఉద్యోగం ఇప్పిస్తామని డబ్బులు తీసుకున్న వారి దగ్గరకు వెళ్లి అడిగితే వారు దౌర్జన్యం చేస్తున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా జరిగింది.
ఓ సంస్థ ఉద్యోగం ఇప్పిస్తామన్నారు. లక్షల్లో డబ్బులు తీసుకున్నారు. జాబ్ ఎప్పటికీ రాకపోవడంతో ఆ నిరుద్యోగ యువకుడు ఆ సంస్థను ప్రశ్నించాడు. దీంతో కోపగ్రస్తుడైన ఆ సంస్థ ఫౌండర్ ఆ నిరుద్యోగ యువకుడిపై దాడి చేశాడు. విచక్షణా రహితంగా కొట్టాడు. ప్లాస్టిక్ వైర్‌తో ఆ యువకుడి శరీరం వాచేలా కొట్టాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సైతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇది ఎక్కడ జరిగింది అనే విషయానికొస్తే
శ్రీకాకుళంలో వెలుగులోకి భారీ మోసం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ భారీగా డబ్బులు దండుకుంది. దాదాపు ఒక్కొక్కరి నుంచి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వసూళు చేసింది.
అయితే డబ్బులు ఇచ్చినా.. ఇంకా జాబ్ రాకపోవడంతో ఓ బాధిత యువకుడు ఆ సంస్థను ప్రశ్నించాడు. జాబ్ ఎప్పుడు ఇప్పిస్తారని అడిగాడు. దీంతో కోపంతో ఊగిపోయిన ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ ఫౌండర్ బసవ రమణ ఆ యువకుడిపై దాడి చేశాడు. విచక్షణరహితంగా కొట్టాడు
ఓ ప్లాస్టిక్ వైర్‌తో చితకబాదాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియా చక్కర్లు కొడుతోంది. దీంతో నెటిజన్లు బసవ రమణపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Also read
- కుమార్తె భవిష్యత్తు కోసం తండ్రి కిడ్నీ అమ్మేస్తే.. కానీ భార్య మాత్రం..
- వివాహేతర సంబంధం: భర్తను చంపిన భార్య 10 మంది అరెస్టు
- ప్రియుడి కోసం ఇల్లు వదిలి.. పోలీసుల చేతిలో..!
- రథ సప్తమి విశిష్టత
- భార్యపై అనుమానం.. బాయ్ ఫ్రెండ్ ఇంటికెళ్లి బ్యాగ్‌తో బయలుదేరిన భర్త.. ఆ తర్వాత..