November 21, 2024
SGSTV NEWS
Telangana

కోడేరు గురుకుల పాఠశాలలో విద్యార్థులకు వసతులు కరువు  ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి వి.రాజేష్.


తెలంగాణ….నాగర్ కర్నూల్ జిల్లా :కోడేరు మండలం కోడేరు మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు భోజనం చేశాక రాత్రి 10 గంటల సమయంలో ఫుడ్ పాయిజన్ కావడంతో విద్యార్థులు తీవ్ర అస్వస్థకు గురై హాస్పిటల్లో చేరడం జరిగింది..
    విషయం తెలుసుకున్న ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి వి.రాజేష్ హాస్పిటల్లో ఉన్న విద్యార్థుల దగ్గరికి వెళ్లి సందర్శించడం జరిగింది…




    మండల కేంద్రంలోని ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే గర్ల్స్ హాస్టల్ లో విద్యార్థులకు సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులకు గురికావడం జరుగుతుంది. ఒకవైపు విద్యార్థులకు పదో తరగతి పరీక్షలు జరుగుతున్న సమయంలో వారికి సరైన వసతులు కల్పించకుండా అలాగే నాణ్యతలేని భోజనం పెట్టడంతో విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి గురై విద్య మీద సరైన దృష్టి పెట్టడం లేదన్నారు.మరియు ఇప్పటికైనా జిల్లాఉన్నతాధికారులు గర్ల్స్ హాస్టల్ ని సందర్శించి విద్యార్థులకు సరైన వసతులు కల్పించేలా ఏర్పాటులు చేయాలని కోరడం జరిగింది.
   అలాగే వచ్చే విద్యా సంవత్సరానికైనా స్థానిక మంత్రి దృష్టి సారించి విద్యార్థులకు నూతన భవనం నిర్మించేలా చర్యలు చేపట్టాలని మంత్రిని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది..

SGSరిపోర్టర్ : సత్యనారాయణ కోడేరు మండలం

Also read

Related posts

Share via