ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్ వర్కర్స్ యూనియన్ పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ సమావేశం పాలకొల్లు సమతా మహిళా విజ్ఞాన భవనం, వీవర్స్ కాలనీ నందు యూనియన్ జిల్లా ప్రెసిడెంట్ చెరుకూరి దుర్గా ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించడమైనది. ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్ వర్కర్స్ సంక్షేమం కోసం తమ యూనియన్ మరింత కృషి చేయాలని, వారి వృత్తి నైపుణ్యం మెరుగు పరిచేందుకు తగిన శిక్షణ, సలహాలు యూనియన్ అందజేస్తుందనీ, తమ జీవనోపాధి కాపాడేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
ముఖ్య అతిథులుగా హాజరైన ఐ.యఫ్.టీ.యు జిల్లా సహాయ కార్యదర్శి మరియు యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షురలు ఈమని గ్రీష్మ కుమార్, మామిడి దాన వర ప్రసాద్ లు మాట్లాడుతూ కేంద్రం సూచనల మేరకు 1998 నుండి దేశ వ్యాప్తంగా కార్మికుల సంక్షేమం కోసం కార్మిక సంక్షేమ మండలి ద్వారా ప్రసూతి, మరణం, వైద్యం, వివాహం తదితర ఆర్ధిక ప్రయోజనాలు అమలులో వుండేవనీ గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లో వాటిని నిలుపుదల చేయడంతో కార్మికులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ, నూతనంగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తక్షణమే వాటిని పునరుద్ధరించి తమ ప్రభుత్వం కార్మిక పక్షపాతి అని నిరూపించుకోవాలని కోరారు.
పై సమావేశం లో తాడేపల్లి గూడెం, నర్సాపురం, తణుకు, పాలకొల్లు, భీమవరం, ఆకివీడు తదితర యూనియన్ ల నుండి జిల్లా కార్యవర్గ సభ్యులు నల్లా శివ కుమార్,బండి దుర్గా ప్రసాద్,హరినాథ్ బాబా, గుబ్బల శ్రిను, కేదారేశ్వర రావు,కట్టోజు భాస్కర్,సూరి పండు, బత్తుల నాగేశ్వరరావు,జలతారు చంద్ర శేఖర్, తదితరులు పాల్గొనడమైనది.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025