కృష్ణరాజపురం: నగరంలోని కోరమంగళలో భార్యను రోడ్డుపై హత్య
చేసి పరారైన కిరాతక భర్తని స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. ఆగ్నేయ డీసీపీ సి.కే. బాబా తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 2వ తేదీన కోరమంగళ పరిధిలోని వెంకటపురలో హత్య జరిగింది. ఇందు (28) ఒక సూపర్ మార్కెట్లో పనిచేస్తూ నివసిస్తోంది.
ఆమె భర్త మైకేల్ ఫ్రాన్సిస్ (33), వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రాన్సిస్ పెయింటర్గా పనిచేస్తూ జులాయిగా తిరిగేవాడు. దీంతో ఐదు నెలల కిందట భార్య పుట్టింటికి వచ్చేసింది. ఫ్రాన్సిస్ ఆ రోజు భార్య వద్దకు వచ్చి గొడవపడి ఆమెను రోడ్డుపైనే పొడిచి చంపి పరారయ్యాడు. పోలీసులు విచారణ జరిపి నిందితున్ని అరెస్టు చేసినట్లు డీసీపీ తెలిపారు. భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలే హత్యకు కారణమని చెప్పారు.
Also read
- AP Crime: ఏపీలో మరో పరువు హత్య.. మైనర్ బాలికను చంపేసిన పేరెంట్స్!?
- సర్కార్ గట్టుకు మరమ్మతులు చేపట్టిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ళ రాము
- గురు, రాహువులతో ఆ రాశులకు ఐశ్వర్య యోగాలు..!
- Vastu Tips: ఈ పక్షులు ఇంటికొస్తే మీ దశ తిరిగినట్టే.. ఈ మూగజీవాలు ఇచ్చే సంకేతాలివే..
- నేటి జాతకములు.11 ఏప్రిల్, 2025