ముంబై నటి జెత్వానీ కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఇంటెలిజెన్స్ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు చెబితేనే ఇదంతా చేశామని డీసీపీ విశాల్ గున్నీ చెప్పారు. విశాఖకు బదిలీ చేసినా కేసు పూర్తి చేస్తేనే రిలీవ్ ఆర్డర్ ఇస్తానని డీజీ ఒత్తిడి చేసినట్లు వాంగ్మూలంలో పేర్కొన్నారు.
Actress Jatwani: ముంబై నటి జెత్వానీ కేసులో కీలక మలుపు తిరిగింది. జెత్వానీ వేధింపుల్లో పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్న ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లపై సస్పెన్షన్ వేటు పడిన విషయం తెలిసిందే. కాగా అప్రూవర్‌గా మారిన అప్పటి విజయవాడ డీసీపీ విశాల్ గున్నీ.. జత్వాని కేసుకు సంబంధించిన కీలక సమాచారంతో కూడిన మూడు పేజీల లిఖితపూర్వక వాంగ్మూలాన్ని ఇచ్చాడు. ఈ మేరకు అప్పటి ఇంటెలిజెన్స్ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు చెబితేనే ఇదంతా చేశామని తన స్టేట్మెంట్లో పేర్కొన్నాడు.
సీఎంఓ కార్యాలయానికి పిలిచి..
2024 జనవరి 31న సీఎంఓ కార్యాలయానికి పీఎస్ఆర్ ఆంజనేయులు తనతోపాటు కాంతిరాణా టాటాను పిలిచి జత్వాని కేసుపై అనుసరించాల్సిన వ్యూహం మొత్తం వివరించారని చెప్పాడు. జెత్వానీని ఎలా అరెస్ట్ చేయాలి? కేసు ఏవిధంగా పెట్టాలి? అన్ని వివరాలు ఆంజనేయులు చెప్పారని తెలిపారు. అంతేకాదు విశాఖకు బదిలీ చేసినా కేసు మొత్తం పూర్తి చేసిన తర్వాతే రిలీవ్ ఆర్డర్ ఇస్తానని ఆంజనేయులు ఒత్తిడి చేసినట్టు తన వాంగ్మూలంలో వివరించారు విశాల్ గున్నీ.
అసైన్మెంట్ పూర్తి చేస్తేనే రిలీవ్..
13 రోజులు పాటు తనను విశాఖ వెళ్ళకుండా కేస్ అయ్యేవరకు ఇక్కడే ఉండాలని పీఎస్ఆర్ ఆంజనేయులు చెప్పాడు. అసైన్మెంట్ పూర్తి చేస్తేనే రిలీవ్ చేస్తామన్నాడు. అప్పటి విజయవాడ టాస్క్ ఫోర్స్ ఏడీపీపీ రమణమూర్తి, సీఐ శ్రీధర్, ఎస్సై షరీఫ్ తో పాటుగా తాను ముంబై వెళ్లామని, తమతో పాటు హైదరాబాదు నుండి కుక్కల విద్యాసాగర్ కూడా ముంబై వచ్చినట్లు వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఫిబ్రవరి రెండో తేదీన విద్యాసాగర్ ద్వారా కాదాంబరి జెత్వానీ కదలికలు తెలుసుకొని, ఆమెను అరెస్టు చేసి తీసుకొచ్చినట్టు వాంగ్మూలంలో స్పష్టం చేశారు.
Also read
- అత్తా.. నీ కూతురింక లేదు.. చంపేసిన!
- Andhra Pradesh: 10 నిమిషాల్లో ఇంటికి చేరేవారే.. కానీ అంతలోనే కబలించిన మృత్యువు!
- అయ్యో పాపం.. ఐదేళ్లకే ఆ బాలుడికి ఆయుష్షు తీరిపోయింది..!
- ఎస్బీఐ బ్యాంకుకు కన్నం.. రూ.13 కోట్ల విలువ చేసే బంగారం లూటీ.. లబోదిబోమంటున్న కస్టమర్లు
- స్కూల్‌కి వెళ్లాల్సిన బాలుడు.. బావిలో శవమై తేలాడు.. మిస్టరీగా మారిన మరణం