హైదరాబాద్: విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే కీచకుడిగా మారాడు. పదో తరగతి విద్యార్థినిపై ట్యూషన్ మాస్టర్ వెకిలి చేష్టలకు పాల్పడ్డాడు.
హైదరాబాద్ పిలింనగర్ లో దారుణం జరిగింది. పదో తరగతి బాలికపై ట్యూషన్ ఉపాధ్యాయుడు రాములు అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఉపాధ్యాయుడు చేసిన పనికి మనోవేదనకు గురైన విద్యార్థిని దుఃఖాన్ని దిగమింగుకొని ఇంటికి వెళ్లి విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదుతో కీచక టీచర్ రాములుపై ఫిలింనగర్ పోలీసులు పోక్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించారు.
Also read
- AP Crime: ఏపీలో మరో పరువు హత్య.. మైనర్ బాలికను చంపేసిన పేరెంట్స్!?
- సర్కార్ గట్టుకు మరమ్మతులు చేపట్టిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ళ రాము
- గురు, రాహువులతో ఆ రాశులకు ఐశ్వర్య యోగాలు..!
- Vastu Tips: ఈ పక్షులు ఇంటికొస్తే మీ దశ తిరిగినట్టే.. ఈ మూగజీవాలు ఇచ్చే సంకేతాలివే..
- నేటి జాతకములు.11 ఏప్రిల్, 2025