SGSTV NEWS
Hindu Temple History

Kanipakam Ganapathi History: సత్యప్రమాణాల దేవుడు – కాణిపాకం వినాయకుడు

కాణిపాకం గణపతి ఆలయ చరిత్ర

వినాయకుడు…. హిందూ సంప్రదాయంలో అన్నికార్యాలు, మంచి జరుగుతుందనే భావించే ప్రతిచోట ఆయన పూజతో ప్రారంభించాల్సిందే..! దాదాపు గణపయ్య పూజతోనే అడుగు ముందుకు వేస్తారు. అంతటి మహాత్యం కలిగిన వినాయకుడి పుణ్యక్షేత్రానికి కొలువైంది ఏపీలోని కాణిపాకం. అధ్యాత్మిక నగరి తిరుపతికి 70 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఇక్కడ విగ్నేశ్వరుడు స్వయంగా వెలిసాడని పురాణాలూ చెబుతున్నాయి.

చరిత్ర ఏం చెబుతుందంటే…
Kanipakam temple history: కాణిపాకంలో స్వయంబూ వినాయకుడు వెలిసాడనే చెప్పటంపై ఓ పురాణగాథాన్ని ప్రధానంగా చెబుతుంటారు. వెయ్యి ఏళ్ల కిందట మూగ, చెవిటి, గుడ్డివారు అయిన ముగ్గురి అన్నదమ్ముల ఉండేవారు. వారి వ్యవసాయ బావిలో నీరు ఎండిపోవడం గమనించి బావిని ఇంకొద్దిగా తవ్వితే నీళ్లు వస్తాయని తవ్వడం మొదలు పెట్టగా అక్కడ గట్టి రాయి తగిలి క్షణాలలో బావిలో రక్తం ఊరటం మొదలైందంట. కొద్దీ కొద్దిగా బావి నిండుతుంది. ఆ ముగ్గురు అన్నదమ్ములు ఏమైందో అని గమనించగ బావిలో వినాయకుడి విగ్రహం కనిపించింది. వారు ఆ విగ్రహాన్ని పూజించగా వారి యొక్క అవటితనం తొలగి మామూలు మనుషులుగా మారారు. ఆ విషయం గ్రామస్తులకు తెలిసి ఆ విగ్రహాన్ని పూజించడం మొదలు పెట్టారు. అలా భక్తులు కొట్టిన కొబ్బరికాయల నీరు ఎకరానికి పైగా పారిందంట. దానితో ఆ స్థలానికి “కాణిపాకం ” అనే పేరు వచ్చిందని చెబుతుంటారు. ఈ పేరు నేపథ్యం చూస్తే… “కాణి” అంటే చిత్తడి నేల అని “పాకం” అంటే నీరు ప్రవహించడం అనే అర్థం వస్తుంది

స్వామివారి ఎదుట తప్పుడు ప్రమాణం చేస్తే శిక్ష పడుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం

ఇక్కడి విగ్రహం కాలక్రమేణా పరిమాణంలో పెరుగుతోందని నివేదించబడింది.దీనిపై అనేక అభిప్రాయాలు ఉన్నాయి.

ఏదైనా సమస్య వచ్చినప్పుడు తప్పు చేసిన వ్యక్తిని ఆలయం ముందు ఉన్న నీటిలో స్నానం చేయిస్తే తప్పు ఒప్పుకొంటాడు అని ప్రసిద్ధి

స్వామి వారి ఆలయానికి ఈశాన్య దిశలో వరదరాజ స్వామి ఆలయం కూడా ఉంది.

చాలా మంది రాజకీయ నేతలు కాణిపాకం లో ప్రమాణం చేయాలని సవాల్ కూడా చేస్తుంటారు.

తిరుపతికి వెళ్లే చాలా మంది భక్తులు దాదాపు కాణిపాకానికి వెళ్తుంటారు.

Also read

Related posts

Share this