April 14, 2025
SGSTV NEWS
CrimeTelangana

కామారెడ్డి జిల్లా: భార్య ఘాతుకం.. పాడుబడ్డ ఇంటిలో షాకింగ్ దృశ్యం

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ మండలం తిర్మలాపూర్ లో దారుణం జరిగింది. రాములు అనే వ్యక్తిని గొడ్డలితో భార్య మంజుల, మృతుడి తండ్రి నారాయణ నరికి చంపారు. రాములును హత్య చేసి ఇంటి ప్రక్కనే ఉన్న మరో పాడుబడ్డ ఇంటి లోపల నీటి ట్యాంకులో పడేశారు. ఆపై దుర్వాసన వస్తుందని ఆ ఇంటి ఆవరణలోనే పాతిపెట్టారు.

Also read :CRPF జవాన్‌ దారుణం.. ఆ కారణంతో పెళ్లైన మూడు నెలలకే..

తన భర్త రాములు కనబడటం లేదని ఈ నెల 16న భార్య మంజుల పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దుర్వాసన వస్తుందని కాలనీ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘాతుకం బయటపడింది. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న రాములు మృతదేహాన్ని బాన్సువాడ పోలీసులు వెలికితీశారు. తండ్రి నారాయణ, భార్య మంజులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ జరుపుతున్నారు

Also Ready:CRPF జవాన్‌ దారుణం.. ఆ కారణంతో పెళ్లైన మూడు నెలలకే..

Related posts

Share via