విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు దిగజారి ప్రవర్తించాడు. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.
కాకినాడ: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు దిగజారి ప్రవర్తించాడు. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. విషయం తల్లిదండ్రులకు తెలియడంతో పాఠశాలకు చేరుకొని అతడికి దేహశుద్ధి. చేశారు. ఈ ఘటన కాకినాడలోని జగన్నాథపురం నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో జరిగింది.
గణితం బోధిస్తున్న శ్రీనివాసరావు తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ కొందరు విద్యార్థులు తమ తల్లిదండ్రులను పాఠశాలకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో శ్రీనివాసరావు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అడ్డుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు అతడికి దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఉపాధ్యాయుడిని పోలీస్ స్టేషన్కు తరలించారు. పాఠశాలలో గుడ్ టచ్, బ్యాడ్ టచ్పి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025