అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి జనసేనలో విభేదాలు భగ్గుమన్నాయి. జనసేన నాయకుడు తొలేటి ఉమపై మండల అధ్యక్షుడు పోలిశెట్టి రాజేష్ దాడిచేశాడు. ఈ దాడిలో ఉమ,అతని భార్య గాయపడ్డారు. పార్టీ ఆఫీసులో మండలం మీటింగ్‌లో జరిగిన వాగ్వాదమే దీనికి కారణమని తెలుస్తోంది.
ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి జనసేనలో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. జనసేన పార్టీకి చెందిన ఓ నాయకుడిపై ఆ పార్టీ మండల అధ్యక్షుడు దాడి చేయడం హాట్ టాపిక్‌గా మారింది. నిన్న మధ్యాహ్నం పి.గన్నవరం పార్టీ ఆఫీసులో మండలం మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్‌లో అయినవిల్లి జనసేన నాయకుడు తొలేటి ఉమ, మండల అధ్యక్షుడు పోలిశెట్టి రాజేష్ మధ్య ఒక వాగ్వాదం జరిగింది. ఆ వాగ్వాదమే ఇప్పుడు ఈ దాడికి దారితీసినట్లు తెలుస్తోంది
జనసేనలో భగ్గుమన్న విభేదాలు
అయినవిల్లి జనసేన నాయకుడు తొలేటి ఉమ పై మండల అధ్యక్షుడు పోలిశెట్టి రాజేష్ దాడి చేశాడు. అర్ధరాత్రి మండల అధ్యక్షుడు రాజేష్‌తో పాటు పలువురు వ్యక్తులు తొలేటి ఉమ ఇంటిలోకి చొరబడి కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో జనసేన నాయకుడు ఉమ, అతని భార్య తీవ్రంగా గాయపడ్డారు. తలపై బలంగా కొట్టడంతో వారిని అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు
అదే సమయంలో ఉమ అనుచరులు మండల అధ్యక్షుడు పోలిశెట్టి రాజేష్ కారును ధ్వంసం చేశారు. ఇక ఈ విషయం పోలీసుల వరకు వెళ్లడంతో వారు రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా జనసేన మండల అధ్యక్షుడు పోలిశెట్టి రాజేష్ ను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. అదే విధంగా రాజేష్ కారుపై దాడి చేసిన సంఘటనలో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025
ముఖ్యమంత్రి పదవిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారో తెలుసా?