April 16, 2025
SGSTV NEWS
CrimeNational

ఆరేళ్ల మూగ కుమారుడిని మొసళ్లు తిరిగే ఓ కాలువలో విసిరేసిందో కన్న తల్లి.

దారుణాతి దారుణ ఘటన ఇది. కన్న తల్లే నవమాసాలు మోసి.. కన్న కొడుకు కడతేర్చింది. బాబు మూగవాడు అవ్వడమే అతడు చేసిన పాపం. కొంచెం కూడా జాలి, ప్రీతి లేకుండా.. మొసళ్లు ఉన్న కాలవలో కొడుకును పడేంది తల్లి. సండే మార్నింగ్.. బాలుడి డెడ్‌బాడీని పోలీసులు బయటకు తీశారు. ఘటనకు సంబంధించి బాలుడి పేరెంట్స్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ ఘటన కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. దండేలి మండలంలో నివసించే  రవికుమార్(27), సావిత్రి(26).. ఇద్దరు పిల్లలు సంతానం. అయితే అతడి పెద్ద కుమారుడు వినోద్(6) పుట్టుకతోనే మూగవాడు. వినోద్ పరిస్థితి గురించి.. భార్యభర్తలు రోజూ గొడవ పడుతూ ఉండేవారు. అలాంటి బిడ్డను ఎవరు సాకుతారు.. అసలు ఎందుకు కన్నావు? వాడ్ని దూరంగా ఎక్కడైనా పడేసిరా అంటూ భార్యను వేధించేవాడు రవికుమార్. ఇదే విషయమై దంపతులు మధ్య శనివారం జరిగిన గొడవ తీవ్రస్థాయికి వెళ్లింది. దీంతో మనస్తాపానికి గురైన సావిత్రి తన తనయుడు వినోద్ను మొసళ్లు ఉన్న కాలువలోె పడేసింది. ఈ కెనాల్లో కాళీ నదికి కనెక్ట్ అయి అవుతుంది.

ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందించారు. వెంటనే స్పాట్‌కు చేరుకున్న పోలీసులు, స్థానికులు, గజఈతగాళ్లు సాయంతో బాలుడి ఆచూకి కోసం గాలింపు చేపట్టారు. అయితే చీకటి అవ్వడంతో సహాయక చర్యలు ఆటంకం కలిగింది. సోమవారం ఉదయానికల్లా బాలుడు డెడ్‌బాడీని వెలికితీశారు. అతడి మృతదేహంపై బలమైన గాట్లు ఉన్నాయి. అలానే ఒక చేయి కూడా లేదు. దీంతో మొసళ్ల దాడిలో బాలుడు మరణించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తన్నారు. పోస్టుమార్టం కోసం డెడ్‌బాడీని ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి బాలుడి పేరెంట్స్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Also read

Related posts

Share via