నాలుగు రోజుల క్రితం మహేష్ సోనాక్షిని ఇంటికి పిలిచాడు. గొడవ పెద్దదవడంతో మహేష్ కోపంతో సోనాక్షి తలపై బలంగా కొట్టాడు. సోనాక్షి ఒక్క దెబ్బతో అక్కడికక్కడే మరణించింది. ఆ తరువాత ఆమె మృతదేహాన్ని సువర్ణవతి వాగు ఒడ్డుకు తీసుకువచ్చి పూడ్చిపెట్టాడని పోలీసు విచారణలో తేల్చారు. పోలీసులు మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.
కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో ఉన్న సువర్ణవతి నది ఒడ్డున పాతిపెట్టిన మహిళ శవం వర్షాలకు బయటకు వచ్చింది. ఆమె హత్యకు గురైనట్లు గుర్తించిన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టగా కేసులో ఊహించని ట్విస్ట్ ఎదురైంది. మృతురాలు కొళ్లేగాలలో నివసించే విజయ్ కుమార్ భార్య సోనాక్షి (29)గా గుర్తించారు పోలీసులు. అయితే, సోనాక్షి మృతికి కారణంగా లవ్ ఎఫైర్‌గా నిర్ధారించారు.
మృతురాలు సోనాక్షి గత కొంతకాలంగా మహేశ్ బాబు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టుగా గుర్తించారు. ఈ క్రమంలోనే ఆమె తన భర్త, పిల్లలను కూడా వదిలేసి ప్రేమికుడితో వెళ్లిపోయినట్టుగా గుర్తించారు. ఆ తర్వాత మరో వ్యక్తితో ప్రేమ వ్యవహారం నడిపిందని, ఈ విషయాన్ని మొదటి ప్రియుడు మహేష్ బాబు సోనాక్షి కుటుంబానికి తెలియజేశాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది.
నాలుగు రోజుల క్రితం మహేష్ సోనాక్షిని ఇంటికి పిలిచాడు. గొడవ పెద్దదవడంతో మహేష్ కోపంతో సోనాక్షి తలపై బలంగా కొట్టాడు. సోనాక్షి ఒక్క దెబ్బతో అక్కడికక్కడే మరణించింది. ఆ తరువాత ఆమె మృతదేహాన్ని సువర్ణవతి వాగు ఒడ్డుకు తీసుకువచ్చి పూడ్చిపెట్టాడని పోలీసు విచారణలో తేల్చారు. పోలీసులు మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్‌గా చేస్తే సూపర్ ఇన్‌కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!