November 21, 2024
SGSTV NEWS
National

Watch Video: చచ్చాం రా దేవుడో..! కొర్టాలమ్‌ జలపాతానికి ఆకస్మిక వరద.. భయంతో పరుగులు తీసిన సందర్శకులు..




జలపాతానికి వరద ఉధృతి కొనసాగుతుండగా, స్థానిక అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జలపాతం సందర్శనలపై తాత్కాలికంగా నిషేధం విధించారు. అగ్నిమాపక, రక్షణ విభాగానికి చెందిన ఓ బృందం వాటర్‌ ఫాల్స్‌ దగ్గరికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది.

పశ్చిమ కనుమల్లో అకస్మాత్తుగా కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. అకాల వర్షంతో తమిళనాడులోని టెంకాసిలోని పాత కొర్టాలమ్‌ జలపాతానికి వరదలు పోటెత్తింది. ఒక్కసారిగా వరద ముంచుకురావడాన్ని గమనించిన సందర్శకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. వరద ఉధృతికి బంధువులతో కలిసి స్నానానికి వెళ్లిన 17 ఏళ్ల బాలుడు కొట్టుకుపోయాడు.

బాలుడిని అశ్విన్‌గా గుర్తించారు. అతను పాలయంకోట్టైలోని ఎన్జీవో కాలనీలో 11వ తరగతి చదువుతున్నాడు. విషయం తెలిసిన వెంటనే తమిళనాడు ఫైర్ అండ్ రెస్క్యూ డిపార్ట్‌మెంట్ బృందం జిల్లా కలెక్టర్ ఎకె కమల్ కిషోర్, పోలీసు సూపరింటెండెంట్ టిపి సురేష్ కుమార్‌తో కలిసి రెస్క్యూ ఆపరేషన్‌కు దిగారు.

జలపాతానికి వరద ఉధృతి కొనసాగుతుండగా, స్థానిక అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జలపాతం సందర్శనలపై తాత్కాలికంగా నిషేధం విధించారు. తమిళనాడు అగ్నిమాపక, రక్షణ విభాగానికి చెందిన ఓ బృందం వాటర్‌ ఫాల్స్‌ దగ్గరికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. వాటర్‌ ఫాల్‌కు వరద పోటెత్తిన దృశ్యాలను కింది వీడియోలో సోషల్ మీడియాలో అప్పుడే వైరల్‌ అవుతున్నాయి.

Also read

Related posts

Share via