November 22, 2024
SGSTV NEWS
Crime

రూ.లక్ష ఫోన్ అర్డర్ పెట్టాడు.. డెలివరీ అయిన తర్వాత కస్టమర్ ఏం చేశాడంటే..!

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సెల్‌ఫోన్‌ను అన్‌లైన్‌లో పెట్టిన ఆర్డర్‌ను డెలివరీ చేసేందుకు వచ్చిన బాయ్‌ను అత్యంత పాశవికంగా హతమార్చారు దుండగులు. డెలివరీ బాయ్ ను గొంతు నులిమి చంపి.. మూట కట్టి ఇందిరా కెనాల్‌లో పడేసినట్లు లక్నో డిప్యూటీ పోలీస్ కమిషనర్ తెలిపారు.


ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సెల్‌ఫోన్‌ను అన్‌లైన్‌లో పెట్టిన ఆర్డర్‌ను డెలివరీ చేసేందుకు వచ్చిన బాయ్‌ను అత్యంత పాశవికంగా హతమార్చారు దుండగులు. డెలివరీ బాయ్ ను గొంతు నులిమి చంపి.. మూట కట్టి ఇందిరా కెనాల్‌లో పడేసినట్లు లక్నో డిప్యూటీ పోలీస్ కమిషనర్ తెలిపారు.

లక్నోలో హిమాన్షు కనోజియా అనే వ్యక్తి ఆన్‌లైన్‌లో మొబైల్ ఫోన్ ఆర్డర్ చేశాడు. క్యాష్ ఆన్ డెలివరీ (COD) ఎంచుకున్నాడు. దీంతో డెలివరీ బాయ్ భరత్ సాహూ (30) మొబైల్‌తో అతని ఇంటికి చేరుకోగా, అతను తన సహచరులతో కలిసి డెలివరీ బాయ్‌ను గొంతు నులిమి హత్య చేసి, మొబైల్‌తో అదృశ్యమయ్యారు. ఇక్కడ డెలివరీ బాయ్ ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు వెతకడం ప్రారంభించారు. వారం రోజుల తర్వాత పోలీసుల విచారణలో ఇద్దరు హంతకులు పట్టుబడ్డారు.

30 ఏళ్ల భరత్ ఈ-కామర్స్ కంపెనీలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. లక్నోలోని చిన్‌హాట్‌లో నివసిస్తున్న హిమాన్షు కనోజియా నంబర్ నుండి రెండు ఫోన్లు ఆర్డర్ చేశారు. ఒకటి Google Pixel, మరొకటి Vivo, దీని ధర సుమారు లక్ష రూపాయలు. సెప్టెంబర్ 24న, మొబైల్ డెలివరీ చేసేందుకు చిన్‌హట్‌లోని దేవా రోడ్‌లోని హిమాన్షు ఇంటికి భరత్ చేరుకున్నాడు. భరత్ పిలిచినప్పుడు, హిమాన్షు కాన్ఫరెన్స్ కాల్ చేసి, అతని భాగస్వామి గజానన్‌తో మాట్లాడేలా చేశాడు. మొబైల్ రిసీవ్ చేసుకున్నాడు గజానన్. అయితే అవకాశం దొరికిన గజానన్ తన స్నేహితుడు ఆకాష్‌తో కలిసి భరత్‌ను గొంతుకోసి హత్య చేసి మొబైల్ ఫోన్, డబ్బు దోచుకున్నారు. అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి ఇందిరా కెనాల్‌లో పడేశారు. ఈ ఘటనలో గజానన్ ప్రధాన నిందితుడు కాగా, ఆకాష్, హిమాన్షు అతడి సహచరులు. గజానన్ ఇంకా పరారీలో ఉండగా, ఆకాష్, హిమాన్షులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలావుండగా, గజానన్‌, భరత్‌తో కలిసి అదే కంపెనీలో రెండు నెలలు పనిచేశాడని పోలీసులు తెలిపారు.

ఇదిలావుండగా గజానన్, భరత్ ఇద్దరి మధ్య స్నేహం గానీ, వివాదాలు గానీ లేవని భరత్‌ సోదరుడు ప్రేమ్‌కుమార్‌ చెప్పారు. కంపెనీలో గజానన్ సుమారు రూ.2.5 లక్షలు ఎగ్గొట్టాడు. అతని నుంచి చాలా విషయాలు దొరికాయి. దీంతో అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు. ప్రస్తుతం అతను చిన్న హార్డ్‌వేర్ దుకాణాన్ని నడుపుతుండగా, ఆకాష్ కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు.

సెప్టెంబర్ 25న భారత్ మిస్సింగ్‌పై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భరత్ కాల్ వివరాల ద్వారా గజానన్ నంబర్‌ను పోలీసులు గుర్తించారు. విచారణలో గజానన్ స్నేహితుడు ఆకాష్ నేరం అంగీకరించాడు. అయితే భరత్ మృతదేహం కోసం పోలీసులు ఇంకా గాలిస్తున్నారు. ఇందిరా కెనాల్‌లో మృతదేహం కోసం స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్‌డిఆర్‌ఎఫ్) బృందం వెతుకుతోంది.

Also read

Related posts

Share via