ఒడిశాలో దారుణ ఘటన చోటుచేసుకుంది.. కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఓ యువకుడిని బాలిక తండ్రి చంపాడు.. అనంతరం మృతదేహాన్ని కాలువలో పడేసి పోలీసులు ఎదుట లొంగిపోయాడు. ఈ ఘటన ఒడిశాలోని దెంకనల్ జిల్లాలోని పర్జాంగ్ పోలీసు పరిధిలోని అఖువాపాడ పంచాయతీలో శనివారం రాత్రి చోటుచేసుకుంది.. తన కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడుతుండగా, ఆ యువకుడిని కొట్టి చంపడం సంచలనం సృష్టించింది. మోహన్‌పాషి గ్రామానికి చెందిన రూపా పింగువ ఈ సంఘటన జరిగిన వెంటనే పోలీసుల ముందు లొంగిపోయాడు.. మృతుడిని అఖువాపాడ పంచాయతీ పరిధిలోని నంబర్ 1 కాలనీ నివాసి కాశీనాథ్ బెహెరా కుమారుడు కరుణాకర్ బెహెరాగా గుర్తించారు.
వివరాల ప్రకారం.. కరుణాకర్ గత మూడు రోజులుగా మోహన్‌పాషి గ్రామంలో జెసిబి వర్కర్‌గా పనిచేస్తున్నాడు. అయితే. తన కూతురిపై లైంగిక దాడి చేస్తున్నప్పుడు కరుణాకర్‌ను రూప పట్టుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఆ కోపంతో రూప అతనిపై పదునైన ఆయుధంతో దాడి చేయడంతో.. అతను మరణించాడని పోలీసులు తెలిపారు. దాడి తర్వాత, నిందితుడు దాదరఘాటి పోలీస్ అవుట్‌పోస్ట్‌లో లొంగిపోయే ముందు మృతదేహాన్ని కాలువ దగ్గర పడేశాడని చెప్పారు.
ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. తన కొడుకు హత్య వార్త తెలియగానే, మృతుడి తండ్రి కాశీనాథ్ బెహెరా, ఇతర బంధువులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని, పింగువా తన కొడుకుపై దారుణంగా దాడి చేసి, కొట్టి, చంపాడని ఆరోపించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇంతలో, ఆ మరణం గురించి అనేక కథనాలు రూపుదిద్దుకోవడం ప్రారంభించాయి. పింగువా కుమార్తె, బాధితుడు సంబంధంలో ఉన్నారని, పింగువా అది జీర్ణించుకోలేక చంపాడని పేర్కొంటున్నారు. వివాదాలు చెలరేగడంతో, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు.. అమ్మాయికి మధ్య ఉన్న వాస్తవ సంబంధాన్ని పరిశీలించడానికి ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.
Also read
- Astro Tips for Marriage: గ్రహ శాంతి పూజ అంటే ఏమిటి? వివాహానికి ముందు గ్రహ శాంతి పూజను ఎందుకు చేస్తారో తెలుసా..
- శివ శక్తి రేఖ: పూర్వీకుల మేధస్సుకి చిహ్నం ఈ 8 శివాలయాలు.. ఒకే రేఖాంశం పై నిర్మాణం..
- మీరు వచ్చే జన్మలో ఎలా పుట్టనున్నారు.? మీరు చేసే పనులే ఆ విషయం చెబుతాయి..
- నేటి జాతకములు…8 డిసెంబర్, 2025
- ఒకరితో ప్రేమ… మరొక అమాయకుడితో పెళ్లి!





