ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాలకు అడ్డూఅదుపు లేకుండా పోతుంది. భాగస్వాములు ఉండగానే మరొకరితో సంబంధాలు పెట్టుకుంటున్నారు జనాలు. తాజాగా ఇలాంటి ఘటనే నోయిడాలోనూ వెలుగు చూసింది. ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న ఒక వ్యక్తి.. ఏకంగా తన స్టేషన్ పనిచేస్తున్న కానిస్టేబుల్‌తోనే సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం అతని భార్యకు తెలియడంతో విషయం వెలుగులోకి వచ్చింది
.

నోయిడాలో సబ్ ఇన్‌స్పెక్టర్‌పై భార్య సంచలన ఆరోపణలు చేసింది. నోయిడాలో ఓ సబ్ ఇన్‌స్పెక్టర్ (SI) భార్య చేసిన ఆరోపణలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. తన భర్త ఓ మహిళా కానిస్టేబుల్‌తో గుట్టు చప్పుడు కాకుండా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని, దీనిపై బిస్రఖ్ పోలీస్ స్టేషన్‌కి అధికారికంగా ఫిర్యాదు చేసినట్టు ప్రీతి శర్మ అనే మహిళ తెలిపింది. SI ప్రస్తుతం విధుల నుంచి సస్పెండ్‌లో ఉండగా ఈ వివాదం మరింత కలకలం సృష్టిస్తోంది.
తన భర్త గతంలో నోయిడా ప్రాంతంలోని థానా ఫేజ్-1, సెక్టార్-24 పోలీస్ స్టేషన్లలో పని చేశాడని, విధుల్లో ఉండగానే మహిళా సహోద్యోగిని ప్రేమలోకి లాగాడని ప్రీతి ఆరోపించింది. రైడ్ పేరుతో వెళ్లిన భర్త వాస్తవానికి మహిళా కానిస్టేబుల్‌తో కలిసి ఉత్తరాఖండ్ టూర్‌కి వెళ్లాడని.. తన ఇద్దరు పిల్లల భవిష్యత్తు నాశనమవుతోందని ప్రీతి శర్మ ఆవేదన చెందుతోంది. తన భర్త ప్రవర్తనలో ఇటీవల చాలా మార్పులు వచ్చాయని, తనను మానసికంగా వేధించడం మొదలు పెట్టాడని పేర్కొంది.
ఇక ఇద్దరిపై కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని, ఉద్యోగాల నుంచి తొలగించాల్సిందేనని భార్య డిమాండ్ చేసింది. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేదేలేదని ఆమె తేల్చి చెప్పింది. ఈ సంఘటన వెలుగులోకి రావడంతో నోయిడా పోలీస్ విభాగంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి వ్యవహారాలు, ప్రభుత్వ ఉద్యోగుల్లో తగిన నైతికత లేకపోతే ప్రజల విశ్వాసానికి తీవ్ర దెబ్బ తగులుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. SI పై కఠినంగా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి
Also read
- Job Astrology: గ్రహాల అనుకూలత.. ఈ రాశులకు పదోన్నతి, అధికార యోగాలు..!
- దీపావళి రోజున ఈ రాశుల జీవితాల్లో దీపాల వెలుగులు.. త్రిగ్రహి యోగంతో అపార సంపద
- TG Crime: జనగామ జైలులో కలకలం.. బ్లీచింగ్ పౌడర్ నీళ్లు తాగి రిమాండ్ ఖైదీ సూ**సైడ్.. కారణం ఇదేనా?
- Khammam : వీడు టీచర్ కాదు టార్చర్.. అబ్బాయిపై లైంగిక వేధింపులు.. రోజు రాత్రంతా!
- Dialysis: డయాలసిస్ కేంద్రాలకు వెళ్ళే వారికి కొత్తరోగాలు.. రాష్ట్రంలో షాకింగ్ ఘటనలు!