November 21, 2024
SGSTV NEWS
CrimeNational

ఎంతటి దారుణం.. గోవుల స్మగ్లర్ అనుకుని 19 ఏళ్ల విద్యార్థిని కాల్చేశారు.. 30 కి.మీ వెంబడించి మరీ..

 

మృతుడు ఆర్యన్‌ అతని స్నేహితులు శాంకీ, హ‌ర్షిత్‌తో కారులో వెళ్తుండగా, గోవులను స్మ‌గ్లింగ్ చేసే వ్య‌క్తులుగా భావించి నిందితులు వెంట‌బ‌డ్డారు. సుమారు 30 కిలోమీట‌ర్ల దూరం కారులో ఛేజ్ చేశారు. డ్రైవ‌ర్ సీటులో ఉన్న హ‌ర్షిత్ కారును ఆప‌లేదు. దాంతో కాల్పులు జ‌రిపారు. ముందు సీటులో కూర్చున్న ఆర్య‌న్‌కు బుల్లెట్ త‌గిలింది. కారు ఆగిన త‌ర్వాత కూడా మ‌రోసారి షూట్ చేశారు.


హ‌ర్యానాలోని ఫ‌రీదాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. చిన్న పొరపాటు కారణంగా 19 ఏళ్ల యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. 12వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న ఓ విద్యార్థిని గో సంర‌క్ష‌కులు కాల్చి చంపేశారు. పశువులను అక్రమంగా తరలిస్తూ స్మ‌గ్లింగ్ చేస్తున్నాడ‌న్న ఆరోప‌ణ‌ల‌పై ఆ విద్యార్థిని అంతం చేశారు. ఆగ‌స్టు 23వ తేదీన జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌లో గోసంర‌క్ష‌ణ గ్రూపున‌కు చెందిన అయిదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. హ‌ర్యానాలోని ఢిల్లీ-ఆగ్రా హైవేపై ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు..మృతుడు ఆర్యన్, అతని స్నేహితులు ప్రయాణిస్తున్న కారును ఢిల్లీ-ఆగ్రా హైవేపై దాదాపు 30 కిమీ మేర నిందితులు వెంబడించారు. ఐదుగురు గోసంరక్షకులను అరెస్టు చేశామని పోలీసులు తాజాగా వెల్లడించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుల‌ను అనిల్ కౌశిక్‌, వ‌రున్‌, కృష్ణ‌, ఆదేశ్‌, సౌర‌భ్‌గా గుర్తించారు. మృతుడు ఆర్యన్‌ అతని స్నేహితులు శాంకీ, హ‌ర్షిత్‌తో కారులో వెళ్తుండగా, గోవులను స్మ‌గ్లింగ్ చేసే వ్య‌క్తులుగా భావించి నిందితులు వెంట‌బ‌డ్డారు. సుమారు 30 కిలోమీట‌ర్ల దూరం కారులో ఛేజ్ చేశారు. డ్రైవ‌ర్ సీటులో ఉన్న హ‌ర్షిత్ కారును ఆప‌లేదు. దాంతో కాల్పులు జ‌రిపారు. ముందు సీటులో కూర్చున్న ఆర్య‌న్‌కు బుల్లెట్ త‌గిలింది. కారు ఆగిన త‌ర్వాత కూడా మ‌రోసారి షూట్ చేశారు.

అయితే, నిందితులు వెంబడించిన విద్యార్థుల కారులో ఇద్ద‌రు బాలికలు కూడా ఉన్నారు. దాంతో కంగుతిన్న నిందితులు అక్క‌డ నుంచి పారిపోయారు. ఆర్య‌న్‌ను ఆస్ప‌త్రిగా తీసుకెళ్లినా ఫ‌లితం లేకపోయింది. అప్పటికే అతడు మృతిచెందినట్టుగా వైద్యులు నిర్ధారించారు. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

తాజా వార్తలు చదవండి

Related posts

Share via