ముజఫర్‌పూర్, మార్చి 12: పెళ్లిలో వీడియో తీసేందుకు వచ్చిన ఓ వ్యక్తి.. వీడియో కవర్ చేయడం మానేసి, పెళ్లి కొడుకు చెల్లిని లైన్‌లో పెట్టాడు. పెళ్లి పనుల్లో అంతా బిజీగా ఉన్న సమయంలో అదను చూసి పెళ్లి కొడుకు చెల్లిని తీసుకుని పరారయ్యాడు. ఈ విచిత్ర ఘటన బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..

బీహార్‌లోని ముజఫర్ నగర్‌లో అహియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చందవారా ఘాట్ దామోదర్‌పూర్ గ్రామంలో ఓ పెళ్లి వేడుకను వీడియో తీసేందుకు వరుడి బావ తన గ్రామానికి చెందిన ఓ ఫొటోగ్రాఫర్‌ను తీసుకొచ్చాడు. పెళ్లి పనుల్లో అంతా జిబీగా ఉన్న సమయంలో ఫొటో గ్రాఫర్ వరుడి సోదరితో మాట కలిపాడు. ఆనక, ఆమెకు మాయ మాటలు చెప్పి పెళ్లి వేడుక పూర్తయిన తర్వాత వీడియోగ్రాఫర్ యువతితో కలిసి పారిపోయాడు. వీడియో గ్రాఫర్‌తో వెళ్లిపోయిన యువతి మైనర్ బాలిక అని తెలుస్తోంది. మార్చి 4న మార్కెట్‌కు వెళ్లిన బాలిక ఎంతకూ ఇంటికి తిరిగి రాకపోవడంతో.. బాలిక తండ్రితోపాటు ఇతర కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు.
రెండు రోజులపాటు ఎన్నో చోట్ల వెతికినా బాలిక ఆచూకీ దొరకలేదు. మరోవైపు వరుడి సోదరి కనిపించకుండా పోయిన రోజు నుంచి వీడియోగ్రాఫర్ కూడా కనిపించట్లేదంటూ గ్రామస్థులు చెబుతున్నారు. దీంతో వీరిద్దరూ కలిసి పారిపోయి ఉంటారని భావిస్తున్నారు. ఫొటోగ్రాఫర్ ఒక బాలికతో అక్కడికి వచ్చినట్లు కొందరు గ్రామస్తులు తెలిపారురు. ఈ ఆరోపణలు వరుడి కుటుంబ సభ్యులు ఖండించారు. దీనిపై బాలిక తరపు బంధువులు అహియాపూర్ పోలీస్ స్టేషన్‌లో కిడ్నాప్ కేసు నమోదు చేశారు. బాలికకు మాయమాటలు చెప్పి వీడియో గ్రాఫర్ కిడ్నాప్ చేశాడని, నిందితుడిని అరెస్ట్ చేసి శిక్షించాలని వారు పోలీసులను కోరారు. ఈ ఘటనతో పెళ్లికి వచ్చిన బంధువులంతా ‘ఇదెక్కడి చోద్యం..’ అంటూ బుగ్గలు నొక్కుకున్నారు. అహియాపూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ రోహన్ కుమార్ మాట్లాడుతూ.. బాలిక అదృశ్యంపై కేసు నమోదు చేసుకున్నాం. నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారని అన్నారు.
Also read
- వరూధుని ఏకాదశి రోజున తులసితో ఈ పరిహారాలు చేయండి.. పెండింగ్ పనులు పూర్తి అవుతాయి..
- Swapna Shastra: కలలో ఈ మూడు పక్షులు కనిపిస్తే మీకు మంచి రోజులు వచ్చాయని అర్ధమట..
- పిల్లలను కారులో ఉంచి లాక్ చేయడంతో…కొంచమైతే ఎంతఘోరం జరిగేది?
- పోలీసోళ్లను పిచ్చోళ్లను చేసింది.. MMTSలో అత్యాచారయత్నం కేసులో బిగ్ ట్విస్ట్ !
- తిరుపతి అక్టోపస్ పోలీస్ కానిస్టేబుల్ దారుణ హత్య..మర్డర్ వెనుక సంచలన విషయాలు