January 28, 2025
SGSTV NEWS
CrimeNational

మరో దారుణం.. కదులుతున్న కారులో బాలికపై సామూహిక అత్యాచారం

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశామని పోలీసు ఉన్నతాధికారి చెప్పారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించామని చెప్పారు. ప్రస్తుతం ఈ ఘటనపై ఒక నిందితుడిని అరెస్టు చేశామని, మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నామని చెప్పారు.


బిహార్‌లోని సహర్షా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ టీనేజీ బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కదులుతున్న కారులో బాలికపై ముగ్గురు వ్యక్తులు తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని బాధిత బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు సీరియస్‌గా స్పందించారు. బాధిత బాలిక మేకలు మేపుకుని ఇంటికి తిరిగి వస్తుండగా.. ముగ్గురు యువకులు బలవంతంగా ఆమెను కారులోకి ఎక్కించారు. ముగ్గురిలో ఒకరు కారు నడుపుతుండగా.. మరో ఇద్దరు కదులుతున్న కారులోనే బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధితులు విలపిస్తూ పోలీసులకు చెప్పుకుంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి ఒకరిని అరెస్ట్ చేశారు. మిగతా ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

బీహార్ లోని సహర్షా జిల్లాలో సెప్టెంబరు 14న ఈ దారుణ ఘటన జరిగింది. ఈ మేరకు బాలిక సదర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశామని ఎస్పీ హిమాన్షు చెప్పారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించామని చెప్పారు. ప్రస్తుతం ఈ ఘటనపై ఒక నిందితుడిని అరెస్టు చేశామని, మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నామని చెప్పారు. మరోవైపు నిందితులు ఉపయోగించిన కారును సీజ్ చేశామన్నారు.

Also read

Related posts

Share via