కుప్పం (చిత్తూరు) : ఓ అధికారి తాగిన మత్తులో ఇంటర్ పరీక్షల మెటీరియల్స్‌ను మారుమూల ప్రాంతంలో వదిలివెళ్లిపోయిన వైనం శుక్రవారం చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగింది. స్థానిక వివరాల మేరకు … రాష్ట్రవ్యాప్తంగా రేపు ఎల్లుండి ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో కుప్పంలో ఓ అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇంటర్మీడియట్ బోర్డ్, అధికారులకు పరీక్షలకు ముందు కొన్ని మెటీరియల్స్ ఇస్తారు. కోషన్ పేపర్స్ ఎన్ ఆర్ కాఫీలు, సీలు స్టాంపులు, సెల్ ఫోన్,లు హాల్ టికెట్లు అందజేస్తారు. ఓ అధికారి మద్యానికి బానిసై ఈ మెటీరియల్స్ మొత్తాన్ని మద్యం సేవించి ఒక మారుమూల ప్రాంతంలో రోడ్డుపై వదిలివెళ్లిపోయాడు. అటువైపు వెళుతున్న ప్రజలు కొంతమంది వాటిని గమనించి మీడియాకి సమాచారం అందజేశారు. సెల్ ఫోన్ తో సహా కొన్ని మెటీరియల్స్ పడి ఉండడంతో పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. పోలీసులు మెటీరియల్స్‌ను స్వాధీనపరుచుకొని విచారణ చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పని చేయాల్సిన అధికారులు, ఇలా చేయడం చాలా బాధాకరమని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
Also read
- Texas: నెల రోజుల్లో ఇంటికి రావాల్సుంది..అంతలోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది!
- కొబ్బరిబొండాల కత్తితో ఇద్దరు కొడుకులను నరికి భవనం పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న తల్లి
- పూజలో కలశం ప్రాముఖ్యత ఏమిటి? మామిడి ఆకులు, కొబ్బరికాయ ఎందుకు పెడతారో తెలుసా..
- Shukra Gochar 2025: మీనరాశిలో శుక్రుడు అడుగు.. మాలవ్య, లక్ష్మీనారాయణ యోగాలు .. మూడు రాశుల వారు పట్టిందల్లా బంగారమే..
- Jupiter Transit 2025: 12 ఏళ్ల తర్వాత బృహస్పతి మిథునరాశిలోకి అడుగు.. మొత్తం 12 రాశులపై ప్రభావం ఎలా ఉంటుంది? పరిహారాలు ఏమిటంటే