పరకాల: గుర్తుతెలియని వ్యక్తులు.. ఓ ఆర్‌ఎంపీ, మాజీ సర్పంచ్ ఇళ్ల ఎదుట మృతుల ఎముకలతో క్షుద్రపూజలు చేశారు. ఈ ఘటన పరకాల మండలం వెంకటాపురంలో కలకలం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ సదన్‌కుమార్, ఇంటి ముందుతో పాటు మాజీ సర్పంచ్ ఇనుగాల రమేష్ కొత్త ఇంటిని నిర్మించుకుంటున్న తరుణంలో గుర్తుతెలియని వ్యక్తులు గురువారం రాత్రి క్షుద్రపూజలు చేశారు.
చాలా చోట్ల క్షుద్రపూజలలో కోళ్లు, మేకలకు సంబంధించిన తలలు, కోడిగుడ్లు వాడుతుండగా వెంకటాపురంలో జరిగిన క్షుద్రపూజల్లో శ్మశాన వాటిక నుంచి కుండల్లో తీసుకొచ్చిన మృతుల ఎముకలను కాల్చి పసుపు, కుంకుమతో పాటు చాటలను వారి ఇళ్ల ఎదుట ఏర్పాటు చేశారు. దీంతో ఊరికి వెళ్లి వచ్చి సరికే ఇళ్ల ఎదుట క్షుద్ర పూజలు చేసి ఉండడంతో కుటుంబీకులు, గ్రామస్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలోకి వెళ్లడానికి కూడా సాహసించలేక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో క్షుద్రపూజలు జరిగాయా? లేక భయపెట్టేందుకు ఎవరైనా ఆకతాయిలు కావాలనే నాటకం ఆడారా? అనే విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025