SGSTV NEWS online
Crime

బెజవాడలో మళ్లీ రెచ్చిపోయిన రౌడీషీటర్లు- బార్ లో తప్ప తాగి బీర్ బాటిల్ తో యువకులపై దాడి వైరల్ వీడియో

– సి సి ఫుటేజ్ లో నమోదైన ఘోర దాడి దృశ్యాలు

– కేసును రాజీ చేసేందుకు వైసిపి నేతల ప్రయత్నాలు



విజయవాడ:
విజయవాడ నగరంలో రౌడీ షీటర్ల ఆగడాలు రోజురోజుకి శృతిమించుతున్నాయి. బబ్బూరి గ్రౌండ్స్ లో కొందరు రౌడీ షీటర్లు కార్ తో హల్చల్ చేసి కొందరిని గాయపరిచిన విషయం మరువక ముందే., కేదారేశ్వరపేట మాధురి బార్ లో మరో రౌడీషీటర్ల ముఠా ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. బార్ లో అందరూ చూస్తుండగానే బీర్ బాటిల్ తో ఓ వ్యక్తి తలపై దాడి చేసి గాయపరిచిన దృశ్యాలు నగరవాసులను కలవరపెడుతున్నాయి. ఈనెల 15వ తేదీ సంక్రాంతి పండుగ రోజు జరిగిన ఈ దాడి ఘటన సీసీ ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. వివరాల్లోకి వెళితే.. కేదారేశ్వరపేట ఎర్రగడ్డ ప్రాంతానికి చెందిన మోహన్ కుమార్ ఓ పార్సిల్ ఆఫీసులో పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. ఈనెల 15వ తేదీ గురువారం (సంక్రాంతి పండగ రోజు) నాడు అదే ప్రాంతంలోని ప్రభాస్ కాలేజీ వద్ద మాధురి బార్ అండ్ రెస్టారెంట్ కు పార్సిల్ తీసుకునేందుకు వెళ్లాడు. కౌంటర్ లో పార్సిల్ తీసుకుంటుండగా., అయోధ్య నగర్ కు చెందిన రాము, సాల్మన్ అనే వ్యక్తులు మోహన్ పై దాడికి దిగారు. ముందుగా సాల్మన్  తన చేతుల్లో ఉన్న బీరు బాటిల్ తో మోహన్ తలపై బలంగా కొట్టాడు. ఈ దాడి ఘటనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వ్యక్తులపై సైతం రాము , సాల్మన్ దాడి చేశారు. అనంతరం మోహన్ పై ఇరువురు బీర్ సీసాలు,  చేతులతో తీవ్రంగా దాడి చేశారు. ఈ ఘటనలో మోహన్ తలపై తీవ్ర గాయాలయ్యాయి. చెవి నుంచి తీవ్రంగా రక్తస్రావం అయింది. ప్రస్తుతం అతను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై బాధితుడు అజిత్ సింగ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇది ఎలా ఉండగా.., నిందితులు రాము, సాల్మన్ లపై గతంలో నగరంలోని అనేక పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదయ్యాయి. అందరూ చూస్తుండగానే బహిరంగంగా మీరు చేసిన దాడి ఆ ప్రాంతవాసులను తీవ్రంగా కలవరపెట్టాయి. గతంలోనూ ఇదే మాదిరిగా నిందితులిద్దరూ అనేక మందిపై దాడి చేసినట్లు స్థానికులు చెప్పుకుంటున్నారు.

గంజాయి, మద్యం, ఇతర మత్తు పదార్థాలను మీరు నిత్యం సేవిస్తుంటారని, ఆ మత్తులోనే అకారణంగా పిచ్చెక్కిన కుక్కల మాదిరిగా ఇతరులపై దాడి చేస్తుంటారని పలువురు చెబుతున్నారు. సమాజానికి పెను సవాలుగా మారిన రాము, సాల్మన్ లపై పోలీసుల చర్యలు తీసుకోకుండా ఉండిపోవడంతో మీరు ఆగడాలు రోజురోజుకి శృతిమించుతున్నాయని ఆరోపణలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. గంజాయి, మద్యం, ఇతర మత్తు పదార్థాల కోసం ఇరువురు నిందితులు దాడి దోపిడీలకు తరచూ పాల్పడుతుంటారనే వాదనలు వినిపిస్తున్నాయి.

కేసు రాజీకి వైసీపీ నేతల ప్రయత్నం:
సెంట్రల్ నియోజవర్గానికి చెందిన ఓ వైసిపి నాయకుడు కేసులు రాజీవ్ చేసేందుకు రంగంలోకి దిగారు. నిందితులు రాము, సాల్మన్ లను వైసిపి నాయకులు భుజాన వేసుకుంటున్నారు. ఈ కేసు నుంచి ఈ ఇద్దరు నిందితులను కాపాడేందుకు ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కొందరు వైసీపీ నాయకులు పోలీసులతో సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేయకుండా పోలీసులకు భారీ నజరానాలు ప్రకటించినట్లు సమాచారం. పోలీసుల సైతం వైసీపీ నేతలు సూచనలను పాటించేందుకు సిద్ధమయ్యారని ప్రచారం జోరుగా సాగుతుంది.

Also read

Related posts