పత్తిపాడు (గుంటూరు) : ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ … గుంటూరు జిల్లాలోని పత్తిపాడు నియోజకవర్గంలో పత్తిపాడు సిఐ మాధవి భారీగా అక్రమ మద్యాన్ని పట్టుకున్నారు. మంగళవారం డిఎస్‌పి ఎం.వెంకటేశ్వరరావు విలేకరులతో మాట్లాడుతూ … గుంటూరుకు చెందిన రామోహన్ తెలంగాణ నల్గండ నుంచి 133 అక్రమ మద్యం సీసాల బాక్సులను తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. మద్యం బాక్సుల నుంచి 6376 సీసాలు స్వాధీన పరుచుకున్నట్లు డిఎస్‌పి తెలిపారు. ఈ మద్యం సీసాల విలువ తెలంగాణలో ఒక్కొక్కటి రూ.130 కు అమ్ముతున్నారని చెప్పారు. పట్టుకున్న మొత్తం మద్యం సీసాల విలువ సుమారు 8,03376 రూపాయలు ఉంటుందని డిఎస్‌పి వెల్లడించారు. అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్న సిఐ మాధవిని ఉన్నత అధికారులు అభినందించారు.
Also read
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం