February 24, 2025
SGSTV NEWS
CrimeTelangana

Illegal Affair: మెదక్ జిల్లాలో దారుణం .. తల్లి అక్రమసంబంధం కొడుకులకు తెలియడంతో


ప్రియురాలు తనని దూరం పెడుతుందన్న కోపంతో ఆమెను చంపేశాడో ప్రియుడు. అనంతరం ఆమెను పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఈ నెల ఆరో తేదీ నుంచి తన తల్లి కనిపించకుండాపోవడంతో ఆమె కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణలో అసలు విషయం బయటపడింది.

Illegal Affair: మెదక్ జిల్లా (Medak District) లో దారుణం జరిగింది. ప్రియురాలు తనని దూరం పెడుతుందన్న కోపంతో ఆమెను చంపేశాడో ప్రియుడు. అనంతరం ఆమెను పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఈ నెల ఆరో తేదీ నుంచి తన తల్లి కనిపించకుండాపోవడంతో ఆమె కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణలో అసలు విషయం బయటపడింది. రేణుక అనే మహిళకు పెళ్లై ఇద్దరు పిల్లలున్నారు. భర్త చనిపోవడంతో  మెదక్ లోని ఫతేనగర్ లో నివాసం ఉంటుంది.  స్థానికంగా ఓ ఆసుపత్రిలో ఆయగా పనిచేస్తున్న రేణుకకు ఇంటిపక్కనే ఉంటున్న ఏసు (40) అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.

చంపేయాలని స్కెచ్
ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధం (Illegal Affair) గా మారింది. కొన్ని రోజులకు విషయం ఇంట్లోని కుమారులుకు తెలియడంతో తల్లిని మందలించారు కుమారులు. దీంతో ప్రియుడు ఏసును  దూరం పెడుతూ వచ్చింది రేణుక.  తనని ఆమె దూరం పెట్టడం తట్టుకోలేక ఏసు ఆమెపై పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలో రేణుకను చంపేయాలని స్కెచ్ వేశాడు.

మద్యం తాగుదామని పిలిచి
ప్లాన్ లో భాగంగా ఆమెను మద్యం తాగుదామని చిన్న శంకరంపేట మండలంలోని కొండాపూర్ అటవీప్రాంతానికి తీసుకెళ్లాడు. మద్యం మత్తలో కత్తితో పొడిచి చంపేశాడు.  అనంతరం డెడ్ బాడీని ఎవరూ కూడా గుర్తు పట్టకుండా ఉండేందుకు పెట్రోల్ పోసి తగ్గలబెట్టాడు.  అయితే రేణుక ఫోన్ కాల్ డేటా ఆధారంగా ఏసును విచారించిన పోలీసులు.   పోలీసుల విచారణలో ఏసు నిజం ఒప్పుకోవడంతో అతన్ని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు.   ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Also read

Related posts

Share via