భర్తకు తెలియకుండా భార్య అప్పులు చేయడంతో కోపోద్రిక్తుడైన భర్త భార్యపై కత్తితో దాడి చేసిన ఘటన జవహర్‌నగర్(పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
హైదరాబాద్: భర్తకు తెలియకుండా భార్య అప్పులు చేయడంతో కోపోద్రిక్తుడైన భర్త భార్యపై కత్తితో దాడి చేసిన ఘటన జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. బతుకుదెరువు కోసం నగరానికి వచ్చిన ఇందిర(39) భర్త పెద్దబ్బాయి, ఇద్దరు పిల్లలతో కలిసి జవహర్‌నగర్ సంతోష్ నగర్‌లో నివసిస్తున్నారు. ఆమె నాటుకోడి చికెన్ సెంటర్ నిర్వహిస్తుండగా.. పెద్దబ్బాయి లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. దంపతుల మధ్య తగాదాలతో పెద్దబ్బాయి మూడేళ్లుగా కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. ఇటీవల భార్యాభర్తల మధ్య సయోధ్య కుదరడంతో మూడు నెలల నుంచి కలిసి ఉంటున్నారు. భర్తకు తెలియకుండా ఇందిర నాలుగు లక్షల రూపాయలు అప్పు చేసింది. అప్పు ఇచ్చిన వారు ఇంటికి వస్తుండడంతో పెద్దబ్బాయి భార్యను నిలదీశాడు. సోమవారం చికెన్ షాపు(Chicken shop) వద్ద ఉన్నప్పుడు మాటామాటా పెరగడంతో భర్త భార్యపై కత్తితో దాడిచేశారు. చేతికి, తలపై తీవ్రమైన గాయాలయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా 108 అంబులెన్స్‌లో గాయపడిన ఇందిరను ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025