మహిళలు స్నానం చేస్తుండగా ఫొటోలు తీయడం, వీడియోలు రికార్డు చేస్తున్న ఓ వ్యక్తి,ని మధురానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు గత ఐదేళ్లుగా మహిళలు స్నానం చేస్తుండగా వీడియోలు, ఫొటోలు తీస్తున్నట్లుగా ఒప్పుకున్నాడు. వాటన్నిటిని తొలగించినట్టుగా వెల్లడించాడు.
మహిళలు స్నానం చేస్తుండగా ఫొటోలు తీయడం, వీడియోలు రికార్డు చేస్తున్న ఓ వ్యక్తి,ని మధురానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వెల్లడించిన వివరాల ప్రకారం… మధురానగర్‌కాలనీ కమ్యూనిటీహాల్‌లో కొన్నేళ్లుగా ఓ కుటుంబం విధులు నిర్వర్తిస్తోంది. వారి కుమార్తె సేల్స్‌గర్ల్‌గా పని చేస్తోంది. డ్యూటీకి వెళ్లేందుకు సోమవారం ఉదయం స్నానం చేస్తుండగా సబ్బు కోసం బాత్ రూమ్ లో సబ్బు కోసం వెతకగా ఆమెకు అక్కడ మొబైల్ ఫోన్ దొరికింది. వెంటనే ఆమె బయటకు వచ్చి చూడగా కమ్యూనిటీహాల్‌లో ఎలక్ట్రిషియన్‌గా పనిచేసే వై.మరియాలి కుమార్ బాత్ రూమ్ కిటికీ పక్కన దాక్కుని ఉన్నాడు.
ఫోన్‌తో సహా పరార్
ఈ విషయాన్ని వివాహిత తన భర్తకు తెలియజేసింది. అతడు అక్కడికి వచ్చి మరియాలి కుమార్‌ను పట్టుకోవడానికి ప్రయత్నించగా అతను ఫోన్‌తో సహా పారిపోయాడు. దీంతో జరిగిన విషయాన్ని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. మరియాలి ఐదేళ్లుగా మహిళలు స్నానం చేస్తుండగా వీడియోలు, ఫొటోలు తీస్తున్నట్లుగా ఒప్పుకున్నాడు. తాను తీసిన వీడియోలు, ఫొటోలు అన్నీ తొలగించినట్టుగా వెల్లడించాడు. అనంతరం నిందితుడిని కాలనీ నేతలు మధురానగర్ పోలీసులకు అప్పగించారు
Also read
- ఉగాది పండుగని ఏయే రాష్ట్రాల వారు ఎలా జరుపుకుంటారో తెలుసా? స్పెషల్ వంటకాలేంటంటే..
- మరో ఇల్లాలి ప్రాణం తీసిన ఫైనాన్స్ ప్రతినిధుల వేధింపులు.. అనాథలుగా మారి చిన్నారులు!
- చేతిలో స్టెతస్కోప్, ఒంటి మీద డాక్టర్ కోటు.. పైకి చూసి ఏదో అనుకునేరు.. లోపల యవ్వారం.!
- అబ్బ ఏం స్కెచ్ వేశావ్‌రా.. సైలెంట్‌గా జారుకుందాం అనుకున్నాడు.. కట్‌చేస్తే..
- ఇంట్లో అపస్మారక స్థితిలో కనిపించిన భార్య.. హాస్పిటల్‌కు తీసుకెళ్లగా..





