SGSTV NEWS
CrimeTelangana

యువతికి మత్తు మందు ఇచ్చి లైంగికదాడి.. ఫొటోలు, వీడియోలు తీసి రూ.కోటి ఇవ్వాలని బ్లాక్ మెయిల్..


రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మత్తుమందు ఇచ్చి మహిళపై లైంగికదాడికి పాల్పడడంతో పాటు రూ.20 లక్షల వరకూ కాజేశాడు. అయినా మరో రూ.కోటి ఇవ్వాలని బెదిరించ సాగాడు. ఆ వ్యక్తిపై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయింది.

Hyderabad Sexual Assault Case: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మత్తుమందు ఇచ్చి మహిళపై లైంగికదాడికి(Sexual Assault on Woman) పాల్పడడంతో పాటు బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్న వ్యక్తిపై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో(Banjara Hills Police Station) కేసు నమోదయింది.  వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం 7లో నివాసం ఉంటున్న మహేంద్ర వర్థన్‌ అనే వ్యక్తికి రెండేళ్ల క్రితం ఫేస్‌బుల్‌లో మహిళ (30)తో పరిచయం ఏర్పడింది. వారిద్దరూ ఉస్మానియా యూనివర్సిటీలో(Osmania University) కలుసుకున్నారు. అప్పటినుంచి వారిమధ్య స్నేహం ప్రారంభమయింది

మత్తు మందు కలిపి అత్యాచారం..
ఇలా ఉండగా  ఏడాదిన్నర క్రితం తన ఇంటికి భోజనానికి పిలిచాడు మహేంద్రవర్థన్‌. స్నేహితుడే కదా అని నమ్మిన యువతి అతని ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో ఆమెకు భోజనంలో  మత్తు మందు కలిపి యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.  ఆ సమయంలో  ఫొటోలు, వీడియోలు తీసి ఆ తర్వాత బాధిత యువతిని బెదిరించ సాగాడు

వీడియోలు లీక్ చేస్తానని బ్లాక్ మెయిల్..
భయపడిన ఆ యువతి  అతను అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తూ వచ్చింది. అలా ఇప్పటి వరకు రూ.20 లక్షల వరకూ కాజేశాడు. అయినా వదలని యువకుడు మరో రూ.కోటి ఇవ్వాలని బెదిరించ సాగాడు. తన వద్ద అంత డబ్బు లేదని ఆమె వేడుకున్నా వినిపించుకోకుండా వేధించ సాగాడు. యువతి ఫొటోలు, వీడియోలు బయటకు లీక్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. దీంతో చేసేదేం లేక బాధిత యువతి బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. నిందితుడు మహేంద్రవర్ధన్‌కు చేసిన ట్రాన్సాక్షన్, కాల్స్ వివరాలు అందించి పోలీసులకు కంప్లైంట్ చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహేంద్రవర్ధన్‌ కోసం గాలిస్తున్నారు.  బీఎన్‌ఎస్‌ 64(1),308(2),351(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Also read

Related posts

Share this