April 19, 2025
SGSTV NEWS
CrimeTelangana

హైదరాబాద్ : థెరపిస్టులం అంటూ మహిళలు పరిచయమయ్యారు.. కట్ చేస్తే.. అతన్ని ఇంటి లోపలికి తీసుకెళ్లి..

థెరపిస్ట్ అంటూ పరిచయమయ్యారు.. ఇంకెముంది మనోడు.. పొంగిపోయాడు.. వాళ్లు లోకేషన్ షేర్ చేయ్యగానే రయ్యిరయ్యిన వెళ్లాడు.. చివరకు ఆ లేడీలు.. మసాజ్ పేరుతో న్యూడ్ ఫోటోలు తీసి బ్లాక్ మెయిలింగ్ మొదలుపెట్టారు. తీరా ఏం చేయలేక లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు.. బాధితుడు.. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. హైదరాబాద్‌లో స్పా థెరపిస్ట్‌లుగా వేషధారణలో ఉన్న ఇద్దరు మహిళలు.. ఓ వ్యక్తి బెదిరించి అసభ్యకరమైన ఫోటోలు తీసి బ్లాక్‌మెయిల్ చేస్తున్న ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చవ్వా సతీష్ కుమార్ (54) కి రాణి అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఆమె కుమార్ ను థెరపిస్టుగా పరిచయం చేసుకుంది. ఆ తర్వాత కుమార్‌కు మొబైల్ నంబర్ ఇచ్చింది. ఫోన్లో పరిచయం పెంచుకొని వేరే ఫోన్ నెంబర్ ఇచ్చి అది అనిత (అసలు పేరు రాజలక్ష్మి) అని పిలువబడే రాజలక్ష్మి అనే వేరే థెరపిస్ట్ చెందినదని పేర్కొంది. దీంతో 54 ఏళ్ల కుమార్ రాజలక్ష్మిని సంప్రదించాడు.. బెస్ట్ మసాజ్ సర్వీస్ అందిస్తామని ఆమె లొకేషన్‌ను షేర్ చేసింది. ఇంకెముంది కుమార్ భరత్‌నగర్‌లో ఉన్న ఆ ఇంటి లొకేషన్‌కి వెళ్లాడు. అక్కడ రాజ్యలక్ష్మి, గీత, రజిని అనే ముగ్గురు మహిళలు కుమార్ ను ఇంటిలోపలికి తీసుకెళ్లారు.

అయితే, మసాజ్ సెంటర్ లోపలికి వెళ్ళిన కుమార్.. అది స్పా కాదని గ్రహించి అక్కడి నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆ మహిళలు అతనిని బలవంతంగా అడ్డుకుని.. సినిమాల్లో లాగా బెదిరించారు. అనంతరం దుస్తులు విప్పేసి ఫోటోలు తీసి కుమార్ ని బెదిరించారు. ఆ తర్వాత కుమార్ ను ఎలాగొలా అక్కడినుంచి బయటపడ్డాడు..

అనంతరం గీత కుమార్‌ కి ఫోన్ చేసి రూ.20,000 ఇవ్వకుంటే న్యూడ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరించింది. ఏం చేయాలో అర్థం కాక భయపడిన కుమార్ ఆ మొత్తాన్ని చెల్లించాడు. కొద్దిసేపటికే రాజలక్ష్మి కుమార్ కు ఫోన్ చేసి.. 30 లక్షలు చెల్లించకపోతే ఫోటోలు, వీడియోలను అతని కుటుంబంతో, సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేసింది.

దీంతో భయపడిన కుమార్ మొదట 30 లక్షలు ఇస్తానని ఒప్పుకొని వెంటనే పోలీసులు ఆశ్రయించాడు. వెంటనే రంగంలోకి దిగిన సనత్ నగర్ పోలీసులు.. మహిళల్ని అరెస్టు చేసి భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్లు 342 (తప్పుగా నిర్బంధించడం), 384 (దోపిడీ), 506 (నేరపూరిత బెదిరింపు) r/w 34 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also read

Related posts

Share via