SGSTV NEWS online
CrimeTelangana

Hyderabad: “నజీరాగా పేరు మార్చి కల్మా చదివించారు, బీఫ్ తినిపించారు”.. లవ్ జిహాద్ బాధితురాలి ఆవేదన..video news


Hyderabad: హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన ఓ యువతి లవ్‌ జిహాద్ వలకు చిక్కుకుంది. ఈ మేరకు ఆమె కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలోనే ఫిర్యాదు చేసినప్పటికీ.. నిందితుడు తాను మోసం చేయలేదని ప్లేట్ మారుస్తూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఆ అమ్మాయే తనను ట్రాప్ చేసిందని నమ్మించేందుకు ట్రై చేశాడు. లవ్ జిహాద్ ఆరోపణలను కొట్టిపారేశాడు. దీంతో బాధితురాలు మరోసారి మీడియా ముందుకు వచ్చింది. లవ్ జిహాద్ నిజమేనని.. తానే బాధితురాలిని అని స్పష్టం చేసింది. నవాజ్ తమ్ముళ్లు మునవార్, షారుక్, ఇస్మాయిల్‌లు తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆరోపించింది. కేసు నమోదు తర్వాత నిందితుడు నవాజ్ హైదరాబాద్ నుంచి నెల్లూరు పారిపోయినట్లు బాధితురాలు తెలిపింది. తనను ఎలా చిత్రహింసలు పెట్టారని, బీఫ్ తినిపించారని చెబుతోంది. తనను గ్యాంగ్ రేప్ చేశారో పూర్తి వివరాలు బయటపెడతానని బాధితురాలు చెబుతోంది. ఈ మేరకు తాజాగా ఆమె మీడియాతో మాట్లాడింది.



“సాఫ్ట్ వేర్‌ డెవలపర్‌గా పని చేస్తున్నాను. నవాజ్‌కు అప్పటికే రెండు పెళ్ళిళ్ళు జరిగాయి. నెల్లూరుకు చెందిన నవాజ్ 2025 మేలో పరిచయమయ్యాడు. కుక్కట్ పల్లిలో ట్రేడింగ్ సొల్యూషన్స్ పేరుతో మా షాప్ దగ్గర బిజినెస్‌ స్టార్ట్ చేశాడు. మాకు పరిచయమైన తరువాత హిందువు లాగా మారానని చెప్పాడు. బిజినెస్ పేరుతో మా కుటుంబానికి దగ్గరగా చేరాడు. ట్రేడింగ్, ఫుడ్ బిజినెస్ పేరుతో మూడు రోజులపాటు మాతో మాట్లాడాడు. హిందువుగా మారిపోయినట్టు నాకు సర్టిఫికెట్ సైతం చూపించాడు. నవాజ్ నుంచి నవదుర్గగా మారినట్లు సర్టిఫికెట్ చూపించాడు.. నవాజ్ తమ్ముళ్లు కూడా నాకు చెప్పారు. నా కోసం హిందువుగా మారినట్లు నన్ను నమ్మించాడు. గతేడాది జూలైలో నన్ను పెళ్ళి చేసుకున్నాడు. భవిష్యత్తులో దుబాయ్‌కి వెళ్ళిపోతామని చెప్పాడు. పెళ్ళి సమయంలో నజీరాగా నా పేరును పెట్టారు. కాగా, అక్టోబర్‌లో ఛీటింగ్ చేశాడని తెలిసింది. ఆ విషయం మాకు తెలిసిందని, తను గేమ్స్ స్టార్ట్ చేశాడు. నన్ను చంపుతారు మనం పారిపోదామని నమ్మించాడు. నన్ను బ్లాక్ మెయిల్ చేసేవాడు. నా ఫొటోలను, వీడియోలు అతడి దగ్గర ఉన్నాయి, అవి చూపించి బ్లాక్ మెయిల్ చేసేవాడు. గుల్బర్గాలో ఖాజా నవాజ్ దర్గా దగ్గరికి తీసుకువెళ్లి నా మతం మార్పించాడు. చెప్పిన మాట వినకపోతే నన్ను కొట్టేవాడు. నాతో కల్మా చదివించాడు. నెల్లూరు అడ్రస్ పేరుతో శంషాబాద్‌లో ఓ ఫ్లాట్ ఉంది, అది కూడా అమ్మేశాడు. నా గోల్డ్ మొత్తం ముత్తూట్‌లో పెట్టాడు. నా పేరు మీద‌ లోన్లు తీసుకున్నాడు. నాతో ఫస్ట్ మ్యారేజ్ అని చెప్పాడు. అక్టోబర్ 10 బెంగుళూరు వెళ్ళాము. బాండ్ చూపించి డబ్బులు రావాలి, వెళ్ళి వస్తా అని చెప్పాడు. నైట్ వరకు రాలేదు. ఆ రోజు రాత్రి చైన్నై దగ్గర ఉన్నానని చెప్పాడు. అప్పుడే అనుమానం వచ్చింది. బేగంపేట్‌లో నాకు మత్తు మందు ఇచ్చి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. జరిగిన విషయాన్ని ఎవరికైనా చెబితే అమ్మను, చెల్లెలిని చంపుతానని బెదిరించాడు. లైవ్ జిహాద్ అని నిజమే. హిందూ అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారు. నేనే బాధితురాలిని నా వీడియోలు ఫోటోల కోసమే ఇంతకాలం వాళ్ళ బెదిరింపులకు బెదిరిపోయాను . కానీ ఇక నాకు జరిగింది చాలు ఇంకొకరికి జరగకుండా ఉండాలనే ధైర్యంగా బయటికి వచ్చి చెప్తున్నాను.” అని బాధితురాలు కన్నీరు మున్నీరుగా తన కథను వివరించింది.

Also read

Related posts