మేడ్చల్ రైల్వే స్టేషన్ లో దారుణం చోటుచేసుకుంది. కొందరు దుండగులు ఓ యువతిపై అత్యాచారానికి యత్నించారు. అదృష్టవశాత్తు యువతి వారిని రాయితో కొట్టి తప్పించుకుంది. అనంతరం మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
Hyderabad: రోజురోజుకు మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఒక మరవకముందే మరొకటి ప్రజల్లో ఆందోళనను కలిగిస్తోంది. తాజాగా హైదరాబాద్ మేడ్చల్ రైల్వే స్టేషన్‌లో యువతి పై అత్యాచార యత్నం కలకలం రేపుతోంది. మేడ్చల్ రైల్వే స్టేషన్ లో కొంతమంది గుర్తుతెలియని దుండగులు ఓ యువతి పై అత్యాచారానికి యత్నించారు. అదృష్టవశాత్తు ఆమె ఆ దుండగులను రాయితో కొట్టి అక్కడి నుంచి తప్పించుకుపోయింది. అనంతరం సమీపంలో ఉన్న మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని స్పాట్ ని పరిశీలించి.. ఆధారాలు సేకరించారు. ఆ తర్వాత కేసును రైల్వే పోలీసులకు ట్రాన్స్‌ఫర్ చేశారు
ఇటీవలే కర్ణాటక రైల్వే స్టేషన్ లో
ఇదిలా ఉంటే ఇటీవలే కర్ణాటకలో కెఆర్ పురం రైల్వే స్టేషన్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. మామ కొడుకుతో కలిసి స్టేషన్‌కు వచ్చిన అమ్మాయిపై ఇద్దరు దుండగులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఇద్దరినీ ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి బాధితురాలితో వచ్చిన యువకుడిని ఒక వ్యక్తి అదిమిపట్టుకోగా మరో వ్యక్తి యువతిని రేప్ చేయడం కలకలం రేపింది. స్థానికులు నిందితులలో ఒకరిని పట్టుకుని పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేసిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కేరళలో పనిచేస్తున్న ఆ యువతి బీహార్‌లోని తన ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితులు ఆసిఫ్, సయ్యద్ ముషార్ కర్ణాటకలోని కోలార్ జిల్లాలోని ముల్బాగిలు నివాసితులగా గుర్తించారు. అంతేకాదు నిందితుడు ఆసిఫ్ పై ఇప్పటికే అత్యాచారం ఆరోపణలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Also read
- నువ్వు చాలా అందంగా ఉన్నావు…. తక్కువ వయస్సులా కనిపిస్తున్నావు..
- మాజీ ప్రియురాలిపై రౌడీ షీటర్ లడ్డూ దాడి
- బాత్రూంలో కెమెరాలతో భార్యపై నిఘా.. ప్రసన్న-దివ్య కేసులో బిగ్ ట్విస్ట్
- హనుమంతుడి ఆశీస్సుల కోసం హనుమంతుడి జయంతి రోజున ఏమి చేయాలి? ఏమి చేయకూడదో తెలుసా..
- Lucky Zodiac Signs: చంద్ర మంగళ యోగం.. ఆ రాశుల వారికి అధికారం, ఆదాయం పక్కా..!