హైదరాబాద్ బండ్లగూడ జాగీర్‌లో దారుణం జరిగింది. భార్య బతికి ఉండగానే రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు ఓ సాప్ట్‌వేర్ భర్త. దీంతో తల్లితో కలిసి న్యాయ పోరాటానికి దిగింది అతని భార్య. ఐదేళ్ల క్రితం శ్రీధర్ కుమార్- స్రవంతి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు
హైదరాబాద్ బండ్లగూడ జాగీర్‌లో దారుణం జరిగింది. భార్య బతికి ఉండగానే రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు ఓ సాప్ట్‌వేర్ భర్త. దీంతో తల్లితో కలిసి న్యాయ పోరాటానికి దిగింది అతని భార్య. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఐదేళ్ల క్రితం శ్రీధర్ కుమార్- స్రవంతి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన నాలుగు నెలల నుంచే స్రవంతికి భర్త నుంచి వేధింపులు మొదలయ్యాయి. పిల్లలు పుట్టకుండా టాబ్లెట్‌లు ఇచ్చేవాడని స్రవంతి వాపోయింది. మాయమాటలతో తనను మోసం చేశాడని, ఇప్పుడు మరో పెళ్లికి సిద్ధమయ్యాడని స్రవంతి ఆరోపిస్తుంది.
మోజు తీరాక చివరికి తనతో మోజు తీరాక నీతో అవసరం లేదు.. నా ఇంట్లో నుండి వెళ్లిపో.. నేను వేరే అమ్మాయితో వివాహం చేసుకుంటానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడుతన్నాడని చెబుతోంది. భర్త రెండో పెళ్లి విషయం తెలిసిన భార్య స్రవంతి, తన తల్లితో కలిసి భర్త ఇంటి ముందు ప్లకార్డులు పట్టుకొని పోరాటం చేస్తుంది. తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడినుంచి కదిలేది లేదు అంటూ భీష్మించి కూర్చుంది. ఆమె మౌనపోరాటం ఇంతవరకు భర్త శ్రీధర్ స్పందించలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025