April 4, 2025
SGSTV NEWS
TelanganaTrending

రోడ్డు లేక రాలేకపోయిన అంబులెన్స్.. మార్గ మధ్యలోనే ప్రాణాలు కోల్పోయిన యువకుడు

ఇంకెన్నాళ్లీ కష్టాలు.. అభివృద్ధి అంటే పట్టణాలు, నగరాలేనా? మారుమూల పల్లెలు, గూడాలు అభివృద్ధికి నోచుకోవా? రోడ్డు మార్గం అందని కలేనా? అనారోగ్యం పాలైతే మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోవల్సిందేనా? అక్కడి జనం కష్టాలు చూస్తుంటే.. ఇంతేనా అనిపిస్తోంది. తాజాగా మంచిర్యాల జిల్లాలో హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది.

నెన్నెల మండలం కోణంపేట గ్రామానికి చెందిన జింజిరి బాపు – బుజ్జక్క దంపతుల రెండవ కుమారుడు జస్వంత్ (17) పంట పొలానికి వెళ్లి ఇంటికి వస్తూ అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన స్థానికులు 108 అంబులెన్స్ కి సమాచారం ఇచ్చారు. అయితే ఆ గ్రామానికి 108 అంబులెన్స్ వచ్చే అవకాశం లేదని, చీమరాగల్ల వరకు రావాలని సూచించారు. ద్విచక్ర వాహనాలు కూడా వెళ్లలేని పరిస్థితి ఉండటంతో తప్పని పరిస్థితుల్లో ఎడ్ల బండిపై జస్వంత్ ను అంబులెన్స్ వరకు తీసుకెళ్లారు‌. కానీ అప్పటికే జరగరాని ఘోరం జరిగిపోయింది. అంబులెన్స్ వద్దకు చేరుకునే లోగానే జస్వంత్ ప్రాణం పోయింది. ప్రథమ చికిత్స అందే అవకాశం లేకపోవడం రోడ్డంతా బురదమయంగా మారడంతోనే యువకుడి ప్రాణాలు గాలిలో కలిశాయని ఆవేదన వ్యక్తం చేశారు స్థానికులు. రోడ్డు ఉండి ఉంటే మా కొడుకు బ్రతికే వాడని కన్నీరుమున్నీరయ్యారు తల్లిదండ్రులు‌.





Also read

Related posts

Share via