July 3, 2024
SGSTV NEWS
Spiritual

పంచామృతం అంటే ఏంటి..? ఎలా తయారు చేసుకోవాలి..

ఆరోగ్యానికిది అమృతంతో సమానం..!
ఇది శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని సమతుల్యం చేయడానికి దోహదం చేస్తుంది. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పండ్ల నుంచి వచ్చే రసం గానీ, కొబ్బరి నీళ్లు గానీ కలిపితే పంచామృతం అవుతుంది. ఐదు పవిత్ర పదార్థాలతో తయారు చేసే ఈ పదార్థం.. దేవుడికి అభిషేకం చేయడానికి, పూజలో ఉపయోగిస్తారు. పంచామృతాన్ని ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? పూజలో పంచామృతాన్ని ఎందుకు ఉపయోగిస్తారు..? ఇక్కడ తెలుసుకుందాం..

దేవుడికి పంచామృతాలతో అభిషేకం చేస్తారు. భారతీయ సంప్రదాయం ప్రకారం, పంచామృతం అనేది పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార లేదా బెల్లం మిశ్రమం. ఇవి ఐదు పవిత్ర పదార్థాలు హిందూ మతంలో ఆరాధన, భక్తిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. పంచామృతం హోమం – హవన్, పూజ సమయంలో అనేక మతపరమైన ఆచారాలలో ఉపయోగిస్తుంటారు. ఈ ఐదు పదార్థాలను ఉపయోగించడం ద్వారా, దేవునికి అంకితమైన పవిత్రమైన, స్వచ్ఛమైన నైవేద్యం సిద్ధమవుతుంది. ఇది శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని సమతుల్యం చేయడానికి దోహదం చేస్తుంది. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పండ్ల నుంచి వచ్చే రసం గానీ, కొబ్బరి నీళ్లు గానీ కలిపితే పంచామృతం అవుతుంది. ఐదు పవిత్ర పదార్థాలతో తయారు చేసే ఈ పదార్థం.. దేవుడికి అభిషేకం చేయడానికి, పూజలో ఉపయోగిస్తారు. పంచామృతాన్ని ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? పూజలో పంచామృతాన్ని ఎందుకు ఉపయోగిస్తారు..? ఇక్కడ తెలుసుకుందాం..

పంచామృతం ప్రయోజనాలు:

1. పాలు: పాలు స్వచ్ఛత, పోషణకు చిహ్నంగా పరిగణించబడతాయి
ఆవు పాలు:

ఆవును గోమాత అన్నారు. ఎందుకంటే, ఆవు పాలు తల్లి పాలతో సమానమైనవి. శ్రేష్టమైనవి. ఇవి త్వరగా జీర్ణం అవుతాయి. గేదెపాలకు మల్లేనే ఆవు పాలలో కూడా కాల్షియం అత్యధికంగా వుంటుంది. కాల్షియం చిన్న పిల్లల్లోనూ, పెద్దలలోనూ ఎముకల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. పాలు నిజంగానే అమృతంలా పనిచేస్తాయి. పాలు ఎక్కువగా తాగటం వల్ల బరువు తగ్గుతారని పరిశోధనలలో వెల్లడైంది. పాలలో విటమిన్ ‘ఎ’ కూడా పుష్కలంగా వుంటుంది. ఇది అంధత్వం త్వరగా రాకుండా నివారిస్తుంది.


2. పెరుగు: పెరుగు ఆరోగ్యం, శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణించబడుతుంది.

పెరుగులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. పెరుగు కూడా త్వరగా జీర్ణం అవుతుంది. ఉష్ణ తత్వం వున్నవారికి పెరుగు అత్యధ్బుత ఔషధంగా పనిచేస్తుంది. జీర్ణ సంబంధమైన వ్యాధులను నయంచేసే విషయంలో పెరుగు అత్యంత శక్తివంతంగా పనిచేస్తుందని పరిశోధనలలో తేలింది. కేశ సంరక్షణలో కూడా పెరుగుకే అగ్రస్థానం వుంది. ఉదయం పూట పెరుగు తినటం ఆరోగ్యదాయకం.



3. నెయ్యి: నెయ్యి జ్ఞానం, కాంతికి చిహ్నంగా పరిగణించబడుతుంది.

మేధాశక్తిని పెంచటంలో నేతిని మించింది లేదు. ఆయుర్వేదం ప్రకారం నేతితో తయారైన అరిసెల్లాంటి పదార్థాలు, నెయ్యితో వేయించిన జీడిపప్పు తదితర ఆహారపదార్థాలు పిల్లల్లో జ్ఞాపకశక్తిని పెంచుతాయి. పిల్లలు తినే ఆహారంలో ప్రతిరోజూ నెయ్యి వుండేలా చూసుకోవాలి. దీనివల్ల ముఖం కాంతివంతం అవుతుంది. చర్మ సౌందర్యం పెరుగుతుందని ఆయుర్వేదం సూచిస్తోంది. అయితే నెయ్యిని పరిమితంగానే వాడాలి. నెయ్యిలో ‘ఎ’ విటమిన్ వుంటుంది.

4. తేనె: తేనె మాధుర్యం, జీవితానికి చిహ్నంగా పరిగణించబడుతుంది.

వేల సంవత్సరాల నుంచీ కూడా తేనెను పోషకాహారంగా ఉపయోగిస్తున్నారు. తేనె రుచిగా ఉండటము, మంచి పోషకాహారం కావడమే కాదు, ఇది ఒకరకంగా యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది. తేనె సూక్ష్మ క్రిములతో శక్తివంతంగా పోరాడుతుంది. ఎలాంటి ఇన్ఫెక్షన్లను దగ్గరకు రానీయదు. తేనె ఆహార పదార్థాలు త్వరగా జీర్ణమయ్యేలా దోహదపడుతుంది. తేనెలో ఖనిజాలు చాలా ఎక్కువ స్థాయిలో వుంటాయి. తేనెను సౌందర్య సాధనంగా కూడా ఉపయోగిస్తారు. తేనె చర్మ సంరక్షణలో అద్వితీయమైన పాత్రను పోషిస్తుంది.



5. గంగాజలం: గంగాజలం స్వచ్ఛతకు చిహ్నంగా పరిగణించబడుతుంది.
పంచదార శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది.
ఈవిధంగా పంచదార, పాలు, పెరుగు, నెయ్యి, తేనె తో చేసిన ప్రసాదాన్ని పంచామృతం అనడానికి కారణం ఏంటి అంటే దేవతలు అమృతం తాగి మరణం అనేది లేకుండా చేసుకున్నారు. అలానే కలియుగంలో ఈ పంచ ఔషదాలతో చేసిన ఈ ప్రసాదాన్ని తింటే ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటారనే ఉద్దేశం తో దీనికి పంచామృతం అని పేరు పెట్టారని చెబుతారు.

పంచామృతం ఆచార ప్రయోజనాలు:

పంచామృతం దేవతలను అభిషేకించడానికి ఉపయోగిస్తారు. దేవతలకు పంచామృతాలతో అభిషేకం చేయడం వల్ల దేవతలు త్వరగా ప్రసన్నమవుతారని, భక్తుల కోర్కెలు నెరవేరుతాయని విశ్వాసం. పూజలో కూడా పంచామృతాన్ని ఉపయోగిస్తారు. పంచామృతాలతో దేవుడిని పూజించడం ద్వారా పూజా ఫలాలు రెట్టింపు అవుతాయని విశ్వాసం.

ఆధ్యాత్మిక ప్రయోజనాలు:

పంచామృతం మనస్సును శాంతపరచడంలో, ఏకాగ్రతను పెంచడంలో సహాయకరంగా పరిగణించబడుతుంది. పంచామృతం ప్రతికూల శక్తిని వదిలించుకోవడానికి, సానుకూల శక్తిని ఆకర్షించడంలో సహాయపడుతుందని విశ్వసిస్తారు.

సేకరణ…. ఆధురి భాను ప్రకాష్

Related posts

Share via