తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు.
పుత్తూరు: తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంత్రి రోజా అనుచరుడు, వైకాపా నేత ఉమామహేశ్వరావుకు చెందిన శ్రీవిద్య కళాశాలలో కళాశాలలో 250 కేసుల మద్యాన్ని పట్టుకున్నారు. ఒక్కో కేసులో 48 బాటిళ్లు ఉన్నట్లు సమాచారం. నగరిలో మంత్రి రోజా నామినేషన్ నేపథ్యంలో ఇది బయటపడటం గమనార్హం.
గురువారం పోలీసులు పుత్తూరు బైపాస్ గోవిందపాలెం సమీపంలో తనిఖీలు చేస్తుండగా ఆటోలో మద్యం తరలిస్తూ పుత్తూరు మున్సిపల్ వైస్ఛర్మన్ శంకర్ బంధువు, కాంట్రాక్టర్ తిరునావుక్కరసు పట్టుబడ్డాడు. ఆయన్ను విచారిచంగా శ్రీవిద్య కళాశాల నుంచి తీసుకెళ్తున్నట్లు సమాచారమిచ్చాడు. దీంతో పోలీసులు కాలేజీపై దాడి చేసి 250 కేసుల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు లేకుండా చేసేందుకు మంత్రి రోజా రాత్రి నుంచి పోలీసులపై తీవ్రఒత్తిడి తెస్తున్నారు. ప్రస్తుతం తిరునావుక్కరసు, ఉమా మహేశ్వరరావు, మరో వైకాపా నేత వంశీకృష్ణ నారాయణవనం పోలీసుల అదుపులో ఉండగా.. ఇంకా కేసు నమోదు చేయలేదు.
Also read
- ఆ ఆలయంలో పూజ చేస్తే అపమృత్యు దోషం దూరం! ఎక్కడుందంటే?
- నేటి జాతకములు….25 అక్టోబర్, 2025
- Telangana: 45 ఏళ్ల మహిళతో పరాయి వ్యక్తి గుట్టుగా యవ్వారం.. సీన్లోకి కొడుకుల ఎంట్రీ.. కట్ చేస్తే
- ఉపాధి కోసం కువైట్ వెళ్తానన్న భార్య.. వద్దన్న భర్త ఏం చేశాడో తెలుసా?
- Telangana: వారికి జీతాలు ఇచ్చి ఆ పాడు పని చేపిస్తున్నారు.. పొలీసులే నివ్వెరపోయిన కేసు ఇది..




