SGSTV NEWS
Andhra PradeshCrime

చీరాలలో భారీ మోసం.. విశ్రాంత
వైద్యుడి నుంచి రూ.1.10 కోట్లు స్వాహా!



చీరాల: బాపట్ల జిల్లా చీరాల పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ మోసం జరిగింది. విశ్రాంత వైద్యుడి నుంచి సైబర్ నేరగాళ్లు రూ.1.10 కోట్లు కాజేసిన ఘటన కలకలం రేపింది. చీరాలకు చెందిన ఓ విశ్రాంత వైద్యుడికి ఫోన్ చేసిన సైబర్ కేటుగాళ్లు.. మనీలాండరింగ్కు పాల్పడ్డావంటూ బెదిరించారు. డబ్బులు పంపిస్తే తిరిగి ఖాతాలో జమచేస్తామని చెప్పారు. నిజమేనని నమ్మిన విశ్రాంత వైద్యుడు.. పలు దఫాలుగా రూ.1.10 కోట్లు పంపించాడు. ఆ తర్వాత నగదు తన ఖాతాలో జమకాకపోవడం, ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ రావడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు చీరాల ఒకటో పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఒకటో పట్టణ సీఐ సుబ్బారావు తెలిపారు.

Also read

Related posts