హైదరాబాద్‌లో జూబ్లిహిల్స్ రోడ్ నంబర్ 1లో ఉన్న తెలంగాణ స్పైసీ కిచెట్ రెస్టారెంట్‌లో భారీ పేలుడు సంభవించింది. రెస్టారెంట్ కిచెన్‌లో ఉన్న ఫ్రిజ్ కంప్రెసర్ ఒక్కసారిగా పేలడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇళ్లు ధ్వంసం కాగా, మహిళకు తీవ్ర గాయాలయ్యాయి.
హైదరాబాద్‌లోని ఓ రెస్టారెంట్‌లో భారీ పేలుడు సంభవించింది. జూబ్లీహిల్స్‌లోని రోడ్డు నంబర్ 1లో ఉన్న తెలంగాణ స్పైసీ కిచెన్‌లో ఈ రోజు ఉదయం ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. రెస్టారెంట్‌లో ఉన్న ఫ్రిజ్ కంప్రెసర్ ఒక్కసారిగా పేలడంతో ఈ ఘటన జరిగింది. దీంతో హోటల్ ప్రహరీ పూర్తిగా ధ్వంసం కావడంతో పాటు అక్కడికి వంద మీటర్లలో ఉన్న నాలుగు గుడిసెలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
ఓ మహిళలకు తీవ్రంగా గాయాలు..
ఆ బస్తీలో నివాసం ఉంటున్న ఓ మహిళలకు తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. రోడ్డు మీద రాళ్లు ఎగిరి పడటంతో పాటు కొన్ని విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఉదయాన్నే ఈ పేలుడు సంభవించడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలోని ప్రజలు భయాందళోనకు గురయ్యారు. మొత్తం పొగలతో అలముకుంది. అసలు పొగలు, పేలుడు ఎలా సంభవించిందని స్థానికులు ఆందోళన చెందారు. అయితే గ్యాస్ పేలిందని కొందరు స్థానికులు భావిస్తున్నారు. ఇంత పెద్ద శబ్ధంతో పేలుడు కావడంతో గ్యాస్ పేలిందని స్థానికులు భావిస్తున్నారు.
ఈ భారీ పేలుడు వల్ల బస్తీలో ఉన్న రాళ్లు రోడ్డుపై చెల్లాచెదురుగా అయ్యాయి. అలాగే బస్తీలో ఉంటున్న వారి సామానులు కూడా రోడ్డుపై పడ్డాయి. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదంలో ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఒక మహిళకు మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also read
- నిశ్చితార్థం అయ్యాక పెళ్లి చేసుకోనన్న యువకుడు
- అప్పుల బాధతో ముగ్గురు పిల్లలతో కలిసిబావిలోకి దూకిన తల్లి
- హత్య చేసి.. పక్కింటి దూలానికి వేలాడదీసి!
- భర్తకు రెండో పెళ్లి మాటలతో వేధింపులు?.. టీచర్ ఆత్మహత్య
- Pilgrimage: పుణ్యక్షేత్రాల దర్శనం ఎందుకు చేయాలి..? ఎవరు చేయాలి..? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి





