SGSTV NEWS online
CrimeTelangana

Crime News: ఖమ్మం 54వ డివిజన్ లో హైటెన్షన్..కార్పొరేటర్ భర్త హత్యకు కుట్ర


ఖమ్మం జిల్లాలో అర్థరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. డోర్నకల్‌ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి, ఆయన అనుచరులు తమను బెదిరిస్తున్నారని, అధికార పార్టీకి చెందిన 54 వ డివిజన్‌ కార్పొరేటర్‌ మిక్కిలినేని మంజుల – నరేంద్ర దంపతులు శనివారం రాత్రి ధర్నాకు దిగారు.

Crime News : ఖమ్మం జిల్లాలో అర్థరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. డోర్నకల్‌ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి, ఆయన అనుచరులు తమను బెదిరిస్తున్నారని, అధికార పార్టీకి చెందిన 54 వ డివిజన్‌ కార్పొరేటర్‌ మిక్కిలినేని మంజుల – నరేంద్ర దంపతులు శనివారం రాత్రి ధర్నాకు దిగారు. ఖమ్మం వీడీవోస్‌ కాలనీకి చెందిన సోదరుల మధ్య ఆస్తి గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది.ఈ క్రమంలో తమ్ముడి వైపు డోర్నకల్‌ వాసి వకాల్తా పుచ్చుకుని వారితో ఘర్షణ పడుతున్నారు. కొద్దినెలల క్రితం సదరు సోదరుల తండ్రి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. ఆయన తన చావుకు కారణమంటూ కొందరి పేర్లతో లేఖ రాయడంతో టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.


అయితే ఇటీవల మళ్లీ వివాదం పెరగడంతో ఇంటి ముందు పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేశారు. ఈ ఇంటి సమీపానే కార్పొరేటర్‌ మంజుల కుటుంబం నివసిస్తుంది. అయితే  ప్రతిరోజు గొడవ ఏమిటని డోర్నకల్‌ వాసిని అడగడంతో ఆయన బెదిరించినట్లు మంజుల ఆరోపించారు. అంతేకాక తన అనుచరులతో ఆందోళనకు దిగారు. అయితే వారిని ఎదిరించి మాట్లాడిన మంజుల భర్త మిక్కిలినేని నరేంద్ర పై దాడి చేసేందుకు వారు ప్రయత్నించినట్లు తెలిసింది. గొడ్డలితో ఆయనపై దాడి చేయడానికి ప్రయత్నించగా ఆయన తప్పించుకున్నాడు, అయితే వారంతా డోర్నకల్‌ వాసి ఇంట్లో దూరడం తో వివాదం మరింత ముదిరింది. దీంతో తన భర్తకు ప్రాణహాని ఉందని కార్పొరేటర్‌ మంజుల ఆందోళన వ్యక్తం చేశారు. కాగా ఇంట్లో నక్కిన దుండగులను చంపేయాలంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.సదరు ఇంటిని ఆక్రమించుకున్న వారిని బయటకు పంపాలని రాళ్లు రువ్వడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో టూటౌన్‌ సీఐ బాలకృష్ణ, సిబ్బందితో చేరుకుని డోర్నకల్‌ వాసి అనుచరులను స్టేషన్‌కు తరలించారు.

Also read

Related posts