May 3, 2025
SGSTV NEWS
CrimeTelangana

కాసులివ్వలేదని కన్నతల్లినే కడతేర్చాడు

పెళ్లయిన పదేళ్లకు ఆమె కడుపు పండింది.. కానీ కుమారుడు జన్మించేలోగానే భర్త చనిపోయాడు.. పసిబిడ్డను పట్టుకుని బతుకుదెరువు వెతుక్కుంటూ ముంబయికి చేరింది.. రెక్కలు ముక్కలు చేసుకుని కుమారుడిని పెంచి పెద్ద చేసింది..

తెలంగాణ, మహబూబ్ నగర్ జిల్లా   గండీడ్, : పెళ్లయిన పదేళ్లకు ఆమె కడుపు పండింది.. కానీ కుమారుడు జన్మించేలోగానే భర్త చనిపోయాడు.. పసిబిడ్డను పట్టుకుని బతుకుదెరువు వెతుక్కుంటూ ముంబయికి చేరింది.. రెక్కలు ముక్కలు చేసుకుని కుమారుడిని పెంచి పెద్ద చేసింది.. ఆ తల్లికి అండగా నిలవాల్సిన కొడుకు కాటికి పంపాడు. డబ్బులు ఇవ్వలేదని ఇనుపరాడ్డుతో కొట్టి, గొంతు కోసి కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. మహమ్మదాబాద్ ఠాణా ఏఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం.. గండీడ్ మండలం సల్కర్పేట్కు చెందిన వెంకటమ్మ (55)కు రాములుతో 40 ఏళ్ల క్రితం వివాహమైంది. పదేళ్లకు గర్భం దాల్చగా ప్రసవానికి ముందే భర్త అనారోగ్యంతో మృతిచెందారు. కొన్ని రోజులకు జన్మించిన కుమారుడిని తీసుకొని బతుకుదెరువు నిమిత్తం ముంబయికి వెళ్లారు. అక్కడే ఇల్లు నిర్మించుకున్నారు. కూలి పనులు చేసే కుమారుడు కృష్ణయ్య (30)కు పెళ్లి కాలేదు. కొన్నేళ్ల క్రితం తల్లీకుమారులు స్వగ్రామానికి వచ్చి ఇంటిని నిర్మించుకున్నారు. వ్యసనాలకు అలవాటు పడిన కృష్ణయ్య  ముంబయిలోని ఇల్లు విక్రయించగా వచ్చిన డబ్బులు ఇవ్వాలని తల్లిని వేధించేవాడు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున ఇనుపరాడ్డుతో ఆమె తలపై కొట్టి, గొంతు కోయడంతో అక్కడికక్కడే మృతిచెందారు. తరువాత మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి వేరే వారి ఇంటి ప్రహరీ ముందు పడేశాడు. ఆపై తన తల్లిని ఎవరో చంపేశారని బంధువులకు తెలపగా వారు పోలీసులకు సమాచారమిచ్చారు. మహబూబ్నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ గాంధీనాయక్ చేరుకుని క్లూస్టంతో పరిశీలించారు. కృష్ణయ్యపై అనుమానంతో విచారించగా నేరం అంగీకరించాడు.

Also read

Related posts

Share via