జబల్పూర్: దేశంలో ఇటీవలి కాలంలో భర్తలపై హత్యలకు తెగబడుతున్న మహిళల ఉదంతాలు రేపుతున్నాయి. ఇటువంటి ఘటనలను కలకలం విన్నవారు విస్తుపోతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్లో లో ఇటువంటి ఉదంతమే చోటుచేసుకుంది. జబల్పూర్కు చెందిన ఇంద్ర కుమార్ తివారీ(45)ని పెళ్లి పేరుతో వంచించి, అతనిని అంతమొందించిన సాహిబా బానో అనే మహిళను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు.
జూన్ 6న ఉత్తరప్రదేశ్లోని కుషినగర్లోని హటా ప్రాంతంలోని ఒక కాలువలో ఒక పురుషుని మృతదేహం బయటపడిన దరిమిలా ఈ దారుణం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ వ్యక్తిని కత్తితో పొడిచి హత్య చేశారు. తొలుత ఈ మృతదేహం ఎవరిదైనదీ తెలియలేదు. దర్యాప్తులో కొన్ని వారాల తర్వాత జబల్పూర్ లో అదృశ్య వ్యక్తితో ఈ మృతదేహాన్ని పోల్చి చూడగా, అది ఇంద్ర కుమార్ తివారీ మృతదేహమని తేలింది.
ఈ హత్య వెనుక సూత్రధారి సాహిబా బానో అని, ఆమె ఖుషీ తివారీగా పేరు మార్చుకుని ఇంద్రకుమార్ను ఆకట్టుకున్నదని పోలీసులు తెలిపారు. పెళ్లికాని ఇంద్రకుమార్ ఇటీవల తనకు గల భూమి వివరాలను చెబుతూ ఒక రీల్ చేసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిని చూసిన సాహిబా బానో ఆ భూమిని దక్కించుకోవాలనే ఆశతో, అతనిని ఆకట్టుకునేందుకు ప్రయత్నించింది.
సోషల్ మీడియాలో అతనిని సంప్రదించి, తన పేరు ఖుషీ తివారీ అని పరిచయం చేసుకుని, గోరఖ్పూర్కు రావాలని ఆహ్వానించింది. తర్వాత తన ఇద్దరు సహచరుల సహాయంతో ఇంద్రకుమార్ను వివాహం చేసుకుంది. కొన్ని గంటల తర్వాత తివారీని హత్య చేసి, అతని మృతదేహాన్ని తన సహచారుల సాయంతో కాలువలో పడేసింది. ఈ కేసులో పోలీసులు సాహిబాతో ఆమెకు సహకరించిన ఇద్దరినీ అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025