భారతదేశంలోని అనేక దేవాలయాలకు సంబంధించిన రహస్యాలు నేటికీ అపరిష్కృతంగా ఉన్నాయి. అందుకే అవి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఈ దేవాలయాల్లో పరిష్కరించబడని రహస్యాలు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తాయి. అలాంటి దేవాలయాల్లో ఒక శివాలయంలో నేటికీ సైన్ కి చేధించని మర్మమైన సంఘటన జరుగుతుంది. ఈ ఆలయంలో పూజారి కంటే ముందుగా మరొకరు పూజలు చేస్తారు. ఇప్పటివరకు ఎవరూ ఎవరు ఈ పూజలు చేస్తున్నారో చూడలేకపోయారు.
భారతదేశాన్ని దేవాలయాల దేశం అని పిలుస్తారు. ఇక్కడ అనేక పురాతన దేవుళ్ళు , దేవతల ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలన్నింటికీ వాటి సొంత ప్రత్యేకత, రహస్యం ఉంది. ఇది చూసిన తర్వాత, విన్న తర్వాత ప్రజలు ఆశ్చర్యపోతారు. రహస్యాలతో నిండిన ఈ ఆలయాలలో ఒక శివాలయంలో అశ్వత్థామ స్వయంగా పూజించడానికి వస్తాడట. ఈ ఆలయంలో మరణంలేని విధంగా జీవించమని మహాభారత యుద్ధంలో శ్రీ కృష్ణుడు శపించిన అశ్వత్థామ ఇతనేని స్థానికుల నమ్మకం.
ఆ ఆలయం ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ జిల్లాలోని అసిర్‌గఢ్ కోటలో ఒక పురాతన శివాలయం ఉంది. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఈ కోట రామాయణ కాలంలో అంటే 14వ శతాబ్దంలో నిర్మించబడింది. శాపం తర్వాత.. అశ్వత్థామ గత 5 వేల సంవత్సరాలుగా బుర్హాన్‌పూర్ కోటలో తిరుగుతున్నాడని నమ్ముతారు.
అశ్వత్థామ మొదట శివుడిని పూజిస్తాడు బ్రహ్మ ముహూర్తంలో అశ్వత్థామ మొదట శివుడిని పూజించడానికి అసిర్‌గఢ్ కోటలోని శివాలయానికి వెళ్తాడని నమ్ముతారు. ఇక్కడి పూజారులు శివుడిని పూజించడానికి ఉదయం ఆలయ తలుపులు తెరవకముందే శివుడిని పూజించి అశ్వత్థామ వెళ్లిపోతాడని నమ్ముతారు. ప్రతి ఉదయం శివలింగంపై సమర్పించిన తాజా పువ్వులు, పసుపు, కుంకుమ కనిపిస్తుంది. ఇదే సాక్ష్యం అని అంటారు. స్థానిక నివాసితులు అశ్వత్థామకు సంబంధించిన అనేక కథలను చెబుతారు. అశ్వత్థామను ఎవరు చూసినా వారి మానసిక స్థితి శాశ్వతంగా క్షీణింస్తుందని.. పిచ్చి వారిగా మారి సంచరిస్తారని నమ్మకం. అశ్వత్థామను ఎవరు చూసినా పూర్తిగా పిచ్చివాడవుతాడని ప్రజలు చెబుతారు.
కోటకు సంబంధించిన ఇతర రహస్యాలు కోట పశ్చిమ భాగంలో పురావస్తు బృందం తవ్వకాలు జరిపిందని చెబుతారు. ఈ సమయంలో వారు అనేక ప్రత్యేక వస్తువులను కనుగొన్నారు. తవ్వకం జరిగిన ప్రదేశంలో భూమి కింద ఒక అందమైన రాజభవనం కనుగొనబడింది. ఆ రాజభవనం రాణి కోసం నిర్మించబడి ఉంటుందని చెబుతారు. ఈ రాణి మహల్‌లో 20 రహస్య గదులు వెలుగులోకి వచ్చాయి. పురావస్తు శాఖ ప్రకారం ఈ రాజభవనం 100 x 100 విస్తీర్ణంలో నిర్మించబడింది. ఈ రాజభవనంలో స్నానపు కొలను కూడా ఉంది. తవ్వకాల సమయంలో ఒక జైలు కూడా కనుగొనబడింది. జైలులో ఇనుప కిటికీలు ఉన్నాయి. అలాగే తలుపులు కూడా కనుగొనబడ్డాయి
