April 18, 2025
SGSTV NEWS
CrimeNational

గోడనైతే ఎక్కాడు.. జీవితం చేజారింది

దుర్ఘటనలు ఎన్ని జరుగుతున్నా యువతను రీల్స్ పిచ్చి మాత్రం వదలడం లేదు. తాజాగా మహారాష్ట్రలోని నాగ్పుర్లో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది.

నాగపూర్ : దుర్ఘటనలు ఎన్ని జరుగుతున్నా యువతను రీల్స్ పిచ్చి మాత్రం వదలడం లేదు. తాజాగా మహారాష్ట్రలోని నాగ్పుర ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. 23 ఏళ్ల ఆకాశ్ చకోలే ఆగస్టు 15న స్నేహితులతో కలిసి మకర్తోక్గా డ్యామ్కు వెళ్లాడు. వర్షాల కారణంగా డ్యామ్ నిండి అలుగు పారుతోంది. దీంతో పర్యాటకులు పెద్దసంఖ్యలో వచ్చారు. ఆకాశ్ తనతోపాటు వచ్చిన మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ప్రమాదకర విన్యాసానికి ప్రయత్నించాడు. ముగ్గురూ డ్యాం గోడను ఎక్కే ప్రయత్నం చేశారు. వారిలో ఆకాశ్ ఒక్కడే గోడపైకి చేరగలిగాడు. నీటి లీకేజీ కారణంగా జారుతుండటంతో ప్రమాదం శంకించిన మిగతా ఇద్దరూ ఆకాశ్ను కిందకు లాగేందుకు చేయందించారు. గోడపై చేరిన ఆనందంలో చేతులు ఊపిన ఆకాశ్ ప్రమాదవశాత్తూ పట్టు కోల్పోయి వెనుక ఉన్న డ్యామ్లో పడిపోయాడు. రెస్క్యూ బృందాలు మృతదేహాన్ని బయటకు తీశాయి.

Also read

Related posts

Share via