గుంటూరు జిల్లా ఫిరంగిపురంలోని ఓ రైసు మిల్లు బంకర్లో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 12 టన్నుల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఫిరంగిపురం : గుంటూరు జిల్లా ఫిరంగిపురంలోని ఓ రైసు మిల్లు బంకర్లో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 12 టన్నుల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పౌర సరఫరాలశాఖ అధికారి దేవరాజ్, తహసీల్దారు ప్రసాదరావు తెలిపిన వివరాల మేరకు.. ఫిరంగిపురంలోని రాఘవేంద్ర రైసు మిల్లులో ఆదివారం సోదాలు నిర్వహించారు. మిల్లులో బంకర్లు ఉండగా ఒక దానిలో బియ్యం నిల్వ చేసినట్లు గుర్తించారు. అది రేషన్ బియ్యంగా నిర్ధారణ కావడంతో యాజమాన్యాన్ని ఆరా తీశారు. ఎలాంటి అనుమతులూ లేవని చెప్పడంతో మొత్తం 12 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
Also Read
- శీర్షాసనంలో శివయ్య..!
- హైదరాబాద్ నారాయణ కాలేజీలో దారుణం
- Sattenapalle: అప్పు వివాదం.. తల్లీ కుమారుడి ఆత్మహత్య
- Kadapa: జైల్లో దస్తగిరికి బెదిరింపులు.. మరోసారి విచారణ చేపట్టిన కర్నూలు ఎస్పీ
- Gollaprollu: బాకీ తీరుస్తానంటూ బావిలోకి తోశాడు