తూర్పుగోదావరి జిల్లాలో ఓ మహిళ పట్ల ఇద్దరు వ్యక్తులు దారుణంగా ప్రవర్తించారు. ఆమె స్నానం చేస్తుండగా వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ లొంగదీసుకునేందుకు ప్రయత్నించారు. చివరకు బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
Harassment : సభ్య సమాజంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేస్తున్నా కామంధుల తీరు మారటం లేదు. ప్రతీరోజు ఏదో ఒక చోట కామంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. చిన్నా,పెద్దా అనే తారతమ్యం లేకుండా అందరినీ లైంగికంగా వేధిస్తున్నారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఆడబిడ్డలపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో ఓ మహిళ పట్ల ఇద్దరు వ్యక్తులు దారుణంగా ప్రవర్తించారు. ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తూ లొంగదీసుకునేందుకు ప్రయత్నించారు. చివరకు బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
జిల్లాలోని పిరా రామచంద్రపురం గ్రామానికి చెందిన ఓ మహిళను ఇద్దరు వ్యక్తులు వేధింపులకు గురిచేస్తున్నారు. గ్రామానికి చెందిన ఓ మహిళ స్నానం చేస్తున్న సమయంలో నల్లమిల్లి మణికంఠ రెడ్డి, కర్రీ రామకృష్ణారెడ్డిలు రహస్యంగా వీడియోలు తీశారు. ఆ తరువాత ఆ వీడియోలను మహిళకు చూపించి వేధింపులు మొదలు పెట్టారు. స్నానం చేస్తుండగా చిత్రీకరించిన వీడియో బయటకు రాకుండా ఉండాలంటే తమ కోరిక తీర్చాలంటూ మహిళను బ్లాక్ మెయిల్ చేశారు. ఎవరికైనా చెబితే అశ్లీల వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తామంటూ బాధితురాలిని బెదించారు. దీంతో ఆమె తీవ్ర మానసిక వేదనకు గురైంది. తన సమస్య ఎవరికీ చెప్పుకోవాలో తెలియక కుమిలి పోయింది.
అయినా వారి వేధింపులు ఆగలేదు. చివరకు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు. అశ్లీల వీడియోలతో బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్న ఇద్దరిపై అనపర్తి పోలీస్‌స్టేసన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విషయం తెలిసిన నిందితులు పారిపోయారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎలాగైనా నిందితులను పట్టుకుని వీడియోలు డిలీట్ చేయాలంటూ బాధితురాలు పోలీసులను వేడుకుంది.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025