బీఆర్‌ఎస్‌లో యువ మహిళా నాయకురాలికి వేధింపులు సంచలనంగా మారాయి. ప్రస్తుతం మహిళా నేత సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె ఎవర్ని ఉద్దేశించి ట్వీట్స్ చేసిందనేది చెప్పకపోగా.. ఆ ట్వీట్స్ పెట్టిన కొద్ది సేపటికే డిలీట్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
బీఆర్‌ఎస్‌లో యువ మహిళా నాయకురాలికి వేధింపులు సంచలనంగా మారాయి. ప్రస్తుతం మహిళా నేత సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఆమె ఎవర్ని ఉద్దేశించి ట్వీట్స్ చేసిందనేది చెప్పకపోగా.. ఆ ట్వీట్స్ పెట్టిన కొద్ది సేపటికే డిలీట్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బీఆర్‌ఎస్‌లో యువ మహిళా నాయకురాలికి వేధింపులు ఎదురయ్యాయి. 
ఆ మహిళా నేతను అదే పార్టీలో ఉన్న ఓ పెళ్లికాని యువ నేత వేధిస్తున్నాడు. దాంతో సదరు మహిళా నేత తనకు ఎదురైన పరిస్థితిపై పలు ట్వీట్స్ పెట్టింది. ఎలా చెప్పాలో తెలియక బాధపడుతూ ట్వీట్ చేశానని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే కొద్దిసేపటి తర్వాత ఆ ట్వీట్ ను మహిళా నేత డిలీట్ చేసింది. కాగా ఆమె ట్వీట్స్ ప్రకారం.. తనను వేధించింది హైదరాబాద్‌లో క్రియాశీలంగా ఉంటున్న బీఆర్‌ఎస్ నేత అని, అతను ప్రజాప్రతినిధి కాదు, ఎమ్మెల్యే కావాలని ఆశపడుతున్నట్లు తెలుస్తోంది.
ఆ మహిళా నేత చేసిన ట్వీట్ సారాంశం..
 పార్టీలో ఒక వెధవ ఉన్నాడు, ఎంత నరకం చూపిస్తాడు అంటే.. వాడికి తప్ప ఎవరికి సపోర్ట్ చేసినా, అన్నా అని  పిలిచిన వాళ్లతోనూ అడ్డమైన లింకులు అంటగట్టి బద్నాం చేస్తాడు. మాములు టార్చర్ ఉండదు వాడితో.. అలాంటి వాడు ఉన్న పార్టీలో ఉండాలంటే చాలా కష్టంగా ఉంది. వాడు చేసిన పుణ్యాన కొందరు నాకు దూరమయ్యారు కూడా. అన్న మీద నాకున్న అభిమానం వల్లనే. నీ పేరు బయట పెట్టట్లేదు లేదు రా.. 
అలా అని పార్టీలో నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు అనను. నన్ను సొంత చెల్లిలా చూసుకున్న వాళ్లు ఉన్నారు. వాడి టార్చర్ మాటల్లో చెప్పలేం. అందుకే నాకు ఈ రాజకీయాలు వద్దూ అని చాలా సార్లు అనిపిస్తుంది. I may not be in party but నాకోసం పార్టీ నిన్ను వదులుకోమని కంప్లయింట్ చేయలేను.. ఎందుకు అంటే నాకు తెలుసు పార్టీకి అందరూ సమానమేనని.. కానీ ఏదో రోజు నీ బుద్దే నిన్ను నాశనం చేస్తాది..
- కార్తీక పౌర్ణమి 2025 తేదీ.. పౌర్ణమి తిథి, పూజకు శుభ ముహూర్తం ఎప్పుడంటే?
 - శని దృష్టితో ఈ రాశులకు చిక్కులు.. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది
 - సాక్షాత్తు ఆ చంద్రుడు ప్రతిష్ఠించిన లింగం! పెళ్లి కావాలా? వెంటనే ఈ గుడికి వెళ్లండి!
 - ఆ విషయాన్ని పట్టించుకోని అధికారులు.. కలెక్టరేట్లో పురుగుల మందు తాగిన రైతు..
 - Viral: ఆ కక్కుర్తి ఏంటి బాబాయ్.! ప్రెగ్నెంట్ చేస్తే పాతిక లక్షలు ఇస్తామన్నారు.. చివరికి ఇలా
 





