మనుషుల్లో మానవత్వం రోజు రోజుకీ మంటగలుస్తోంది. తప్పు చేస్తే శిక్షించే అధికారం కూడా వాళ్లే తీసుకుంటున్నారు. ఒక్కోసారి అది హద్దులు దాటి ఒకరిని ఒకరు చంపుకునే వరకూ వెళ్తోంది. ఇక్కడ కూడా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఇంటి ముందు మూత్రం పోశాడన్న కారణంతో ఓ వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
మేడ్చల్ జిల్లా సెంటర్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగిరెడ్డి కాలనీలో జరిగిన ఈ దుర్మార్గమైన ఘటనఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తి తమ ఇంటి ముందు మూత్రం పోశాడనే నెపంతో అదే కాలనీలోనే ఉండే ఇద్దరు వ్యక్తుల మధ్య రాద్ధాంతం చోటు చేసుకుంది. అయితే గొడవకు ఎవరైతే దిగారో.. ఆ వ్యక్తి ఫోన్ చేసి మరీ బోయిన్పల్లి ప్రాంతం నుంచి మరో ఇద్దరిని పిలిపించాడు. అనంతరం ,మూత్రం పోశాడని ఆరోపణలు ఉన్న వ్యక్తి మీద విచక్షణారహితంగా దాడి చేశారు.
ఈ దాడి చేసినవారిలో ఒకరు రౌడీషీటర్ అని తెలుస్తోంది. నడిరోడ్డుపైనే వ్యక్తిని కింద పడేసి ఇష్టం వచ్చినట్లు పెద్ద పెద్ద కర్రలతో చితకబాదారు. అతను తీవ్ర గాయాలతో గట్టిగట్టిగా అరుస్తున్నా ఆపకుండా కొడుతూనే ఉన్నారు. దాడి చేస్తున్న వ్యక్తులను ఓ మహిళ వారిస్తున్నప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయింది. ఆగి.. ఆగి మరీ ఆ వ్యక్తిని కింద నుంచి లేవనీయకుండా కర్రలతో చితకబాదారు. తల మీద కర్రతో గట్టిగా కొడుతూ ఉంటే బాధితుడు విలవిలలాడిపోయాడు.
వీడియో చూడండి..
ఈ ఘటన జరిగింది రాత్రి సమయంలో కావడం వల్ల అక్కడ ఇతరులు ఎవరూ పెద్దగా కనిపించలేదు. చూస్తున్న ఆ కొందరు కూడా వారిని ఆపే ప్రయత్నం చేయలేదు. ప్రస్తుతం బాధితుడు చావు బతుకుల మధ్య హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. కాగా, ఘటనకు సంబంధించిన వీడియో ఆధారంగా నిందితులపై పోలీసులు చర్యలు చేపట్టారు. హత్యాయత్నంగా పరిగణించి దాడి చేసిన ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- ఇంకా దొరకని రాము.. నీతు.. గుండెల్ని పిండేస్తున్న ఘటన..
- Massive Scam: 70 మందికి టోకరా పెట్టిన రిటైర్డ్ టీచర్.. ఏకంగా ఏడు కోట్లు స్వాహా
- చోరీ చేసిన 15 రోజుల తర్వాత సొత్తు తిరిగి ఇచ్చిన దొంగలు.. కానీ వాటిని మాత్రం ఇవ్వలేమంటూ లెటర్
- నాయనమ్మ అంత్యక్రియలు ముగిశాయి.. కానీ, బంగారం మాయమైంది.. చిన్న అనుమానంతో ఆరాతీస్తే..
- దేవతల చేతుల్లో “త్రిశూలం” ఎందుకు? – ఇది దేనికి సంకేతం?





