హైదరాబాద్, : మణికొండ పోకల్వాడలో భారీ భూదందా వెలుగు చూసింది. ధరణిలో గోల్మాల్ చేసి వెయ్యి కోట్లు విలువ చేసే భూమిని కబ్జా చేశారు. కలెక్టర్లంతా ఎన్నికల హడావిడిలో ఉండగా.. ధరణి నుంచి పాస్బుక్లు జారీ అయ్యాయి. ధరణి ఉద్యోగులు చేతి వాటం ప్రదర్శించి ఈ స్కామ్కు పాల్పడ్డారు. ఎమ్మార్వో ఫిర్యాదు చేయడంతో ఈ భాగోతం వెలుగులోకి వచ్చింది.
ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఐదెకరాల భూమిని తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ధరణి ఉద్యోగులతో రూ.3 కోట్లకు డీల్ కుదుర్చుకున్నారు. కొంత డబ్బు తీసుకున్న తర్వాతే రంగారెడ్డి ఇద్దరు కలెక్టర్ల సంతకాలతో పాస్బుక్లు జారీ చేశారు. అయితే.. బ్లాక్ లిస్ట్లో ఉన్న ల్యాండ్కు పాస్ బుక్లు జారీ కావడంతో ఎమ్మార్వో ఖంగుతిన్నారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. సైబరాబాద్ పోలీసులు రంగంలోకి దిగారు.
ఇద్దరు ధరణి ఉద్యోగులతో పాటు ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. భూమిని తమ పేరు మీద రిజిస్టర్ చేసుకున్న ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల్ని సైతం అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో ఉన్నతాధికారుల పాత్రపైనా సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
Also read
- దేవుడి దర్శనం తర్వాత గుడిలో కాసేపు ఎందుకు కూర్చుంటారో మీకు తెలుసా..?
- Crime News: సరూర్నగర్ కిడ్నీరాకెట్ కేసులో కీలక పరిణామం..సీఐడీ చేతికి చిక్కిన సూత్రదారి
- కోచింగ్ సెంటర్’ లవ్ స్టోరీ.. చివరికి బిగ్ ట్విస్ట్
- భార్యకు అదే పిచ్చి… భర్త ఏం చేసాడంటే!
- బీటెక్ విద్యార్థితో వివాహిత జంప్.. మూడు రోజులకే ట్విస్ట్!