SGSTV NEWS online
Andhra PradeshSpiritual

త్రిశక్తుల ఆరాధనతో జ్ఞానవైరాగ్యాలు
– ఆధ్యాత్మిక ప్రవచనకారులు పొన్నూరు వేంకట శ్రీనివాసులు.



ఒంగోలు::

దేవీశరన్నవరాత్రులలో త్రిశక్తుల ఆరాధన  ఙ్ఞానవైరాగాలను కలిగిస్తుందని ప్రముఖ ఆధ్యాత్మిక ఉపన్యాసకులు, ప్రకాశంజిల్లా  రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వేంకట శ్రీనివాసులు అన్నారు. కేశవస్వామిపేటలో లలితాశ్రమంలో జరుగుతున్న దేవీశరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆయన త్రిశక్తుల వైభవంపై ప్రసంగించారు. మహాసరస్వతి వాక్కుని, మహాలక్ష్మి ఐశ్వర్యాన్ని , మహాదుర్గ శక్తిని ప్రసాదిస్తుందన్నారు. ఉపసన్యాసకులు పొన్నూరు వేంకట శ్రీనివాసులుని లలితాశ్రమం మాతాజీ వి‌ఙ్ఞానంద సరస్వతి అమ్మవారి శేషవస్త్రంతో సత్కరించారు. కార్యక్రమంలో స్వయంపాకుల కోటేశ్వరశర్మ, అగస్త్యరాజు శివయ్య, నాదెండ్ల జ్వాలా ఉమామహేశ్వర శర్మ, ఒ.ప్రసాద్‌, గుర్రం కష్ణ, చిలకపాటి రంగారావు తదితరులు పాల్గొన్నారు.

Also read

Related posts